తెలుగు న్యూస్  /  Entertainment  /  Varun Tej Public Letter On Ghani Movie Result

Varun Tej | కష్టపడటం మాత్రం మానను.. గని ఫలితంపై వరుణ్ తేజ్ పోస్ట్ వైరల్

HT Telugu Desk HT Telugu

13 April 2022, 11:00 IST

    • టాలీవుడ్ హీరో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గని. ఈ సినిమా ఫలితంపై ఆయన స్పందించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడనని, అయితే అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు.
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ (twitter)

వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గని. కరోనా కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించాడు. తల్లి సెంటిమెంట్‌తో పాటు బాక్సర్ కావాలనుకునే ఓ యువకుడు పడిన కష్టామే ఈ చిత్ర కథాంశం. అయితే ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చినప్పటికి మరికొంతమంది మాత్రం మిశ్రమ స్పందనలు తెలియజేస్తున్నారు. దీంతో ఈ సినిమా కథానాయకుడు వరుణ్ తేజ్ తాజాగా స్పందించారు. గని ఫలితంపై స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

"మీకు ఆసక్తికరంగా ఏదైనా చేయాలని ఇంతకాలం మేము ఎంతగానో కష్టపడ్డాం. కానీ అనుకున్నంత స్థాయిలో మా ఆలోచనను మీకు అందించలేకపోయానని భావిస్తున్నాం. మీకు వినోదాన్ని అందించాలనిే ఉద్దేశంతో ప్రతి చిత్రానికి పనిచేస్తారు. కానీ కొన్నిసార్లు నేను విజయం సాధిస్తాను. మరికొన్ని సార్లు కొన్ని విషయాలను నేర్చుకుంటాను. కానీ కష్టపడి పనిచేయడం మాత్రం మానను." అని వరుణ్ తేజ్ తన పోస్టులో పేర్కొన్నారు.

వరుణ్ తేజ్ ఈ సినిమా ఫలితం గురించి అటు దర్శకుడును కానీ, ఇటు నిర్మాతను కానీ ఎవరి వైపు వేలెత్తి చూపించలేదు. తమ చిత్రబృందం శాయశక్తులా ప్రయత్నించి సినిమాను తెరకెక్కించిందని, కానీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదని తెలిపారు.

గతంలో ఇదే విధంగా రామ్ చరణ్ కూడా ప్రజలకు బహిరంగంగా పోస్ట్ పెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా విషయంలో చరణ్ ఇదే విధంగా తన స్పందనను తెలియజేశారు. తాజాగా వరుణ్ తేజ్ కూడా సోదరుడిని అనుకరించాడు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర లాంటి భారీ తారాగణం నటించింది. శాయీమంజ్రేకర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. రినైసెన్స్ పిక్చర్స్, అళ్లూ బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతాన్ని అందించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.