తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej | సొసైటీ గెలిచిన వాడి మాటే వింటుందన్న వ‌రుణ్‌తేజ్‌... ‘గ‌ని’ ట్రైల‌ర్ రిలీజ్‌...

Varun Tej | సొసైటీ గెలిచిన వాడి మాటే వింటుందన్న వ‌రుణ్‌తేజ్‌... ‘గ‌ని’ ట్రైల‌ర్ రిలీజ్‌...

Nelki Naresh HT Telugu

17 March 2022, 11:24 IST

  • వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ‘గ‌ని’ ట్రైల‌ర్ ను గురువారం విడుద‌ల‌చేశారు. ఈ ట్రైల‌ర్ లో బాక్స‌ర్ గా కొత్త లుక్ లో  వ‌రుణ్ తేజ్ క‌నిపిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌కు మ‌ద‌ర్ సెంటిమెంట్ ను జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 8 న విడుద‌ల‌కానుంది.

వ‌రుణ్‌తేజ్‌
వ‌రుణ్‌తేజ్‌ (twitter)

వ‌రుణ్‌తేజ్‌

త‌న‌కు గెల‌వ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌ని అంటున్నాడు గ‌ని. సొసైటీ ఎప్పుడూ గెలిచిన వాడి మాటే వింటుంద‌ని బ‌లంగా చెబుతున్నాడు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ‘గ‌ని’ సినిమా ట్రైల‌ర్ ను గురువారం విడుద‌ల‌చేశారు. ఈ ట్రైల‌ర్ లో బాక్సింగ్ నేప‌థ్యంతో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్‌,ప్రేమ‌క‌థ‌,స్పోర్ట్స్ పాలిటిక్స్ ను చూపించారు. ‘గ‌ని..ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడ‌న‌ని ప్రామిస్ చేయి’ అంటూ త‌ల్లి నదియాకు వరుణ్ తేజ్ మాట ఇచ్చేసెంటిమెంట్ డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. తాను బాక్సింగ్ ఆడే విష‌యాన్ని హీరో త‌న త‌ల్లి ద‌గ్గ‌ర దాచిన‌ట్లు ట్రైలర్ లో చూపించారు. ‘ఒక‌వేళ అమ్మ‌కు నిజం తెలిసే రోజు వ‌స్తే..అది నేను నేష‌న‌ల్ ఛాంపియ‌న్ అయ్యే రోజు కావాలి. అదే నా గోల్’ అంటూ వ‌రుణ్ తేజ్ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ‘ఆటలో గెల‌వాలంటే నేను గెల‌వాలి’ అనే డైలాగ్ ఎమోష‌న‌ల్ గా ఉంది. వ‌రుణ్ తేజ్ పై వ‌చ్చే బాక్సింగ్ స‌న్నివేశాల్ని ఇంటెన్స్ గా తెర‌కెక్కించారు. బాక్స‌ర్ పాత్ర కోసం వ‌రుణ్‌తేజ్‌ ఓలింపిక్ బాక్సింగ్ విన్న‌ర్ టోని జెఫ్రీస్ ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్నారు.సీనియ‌ర్ హీరోలు ఉపేంద్ర‌,జ‌గ‌ప‌తిబాబు తో పాటు బాలీవుడ్ న‌టుడు సునీల్‌శెట్టి ఈ ట్రైల‌ర్ లో క‌నిపించారు. న‌వీన్‌చంద్ర నెగెటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్ట‌ర్ చేసిన‌ట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా కిర‌ణ్ కొర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు బాబీ,సిద్ధు ముద్ద‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏప్రిల్ 8న ఈ సినిమా విడుద‌ల‌కానుంది. తొలుత ఫిబ్ర‌వ‌రి 25న సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ విడుదలకావడంతో ఏప్రిల్ కు ‘గని’ ని వాయిదావేశారు

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం