Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
14 May 2024, 17:44 IST
- Sharathulu Varthisthai OTT Release Date: షరతులు వర్తిస్తాయి సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ మిడిల్ క్లాస్ డ్రామా మూవీ ఓటీటీలోకి వస్తోంది.
Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Sharathulu Varthisthai OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్‍తో పాపులర్ అయిన చైతన్య రావ్ ఆ తర్వాతి నుంచి సినిమాల్లోనూ దూసుకుపోతున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. చైతన్య రావ్ ప్రధాన పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ఈ ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కుమారస్వామి. ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు షరతులు వర్తిస్తాయి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.
స్ట్రీమింగ్ డేట్
షరతులు వర్తిస్తాయి సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. “మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా.. అయితే షరతులు వర్తిస్తాయి సినిమా మే 18వ తేదీన ఆహాలో ప్రీమియర్ కానుంది” అని ఆహా నేడు (మే 14) ట్వీట్ చేసింది.
రెండు నెలల తర్వాత..
షరతులు వర్తిస్తాయి చిత్రంలో చైతన్య రావ్, భూమి శెట్టి జంటగా నటించారు. చిరంజీవి, విజయశాంతి అనే క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత మే 18న ఈ చిత్రం ఆహా ఓటీటీలో అడుగుపెడుతోంది.
షరతులు వర్తిస్తాయి చిత్రంలో చైతన్య, భూమితో పాటు నంద కోశోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పలమూరు, వెంకీ, శివ కల్యాణ్, మల్లేశ్ బలస్త్ కీలకపాత్రలు పోషించారు. అక్షర (కుమార స్వామి) దర్శకత్వం వహించిన ఈ మూవీని స్టార్ లైట్స్ స్టూడియోస్ పతాకంపై నాగార్జున సామల నిర్మించారు. అరుణ్ చిలువేరు ఈ చిత్రానికి సంగీతం అందించారు.
షరతులు వర్తిస్తాయి స్టోరీ లైన్ ఇదే
ఆర్థికంగా మోసపోయిన మధ్య తరగతి కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనే అంశం చుట్టూ షరతులు వర్తిస్తాయి మూవీ స్టోరీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే చిరంజీవి (చైతన్య రావ్) కుటుంబాన్ని నడిపేందుకు ఇబ్బందులు పడుతుంటాడు. తాను ప్రేమిస్తున్న విజయశాంతి (భూమి శెట్టి) అతడికి సపోర్ట్‌గా ఉంటుంది. వారి వివాహం కూడా జరుగుతుంది. అయితే, అనుకోకుండా ఆర్థికంగా ఓ విషయంలో చిరంజీవి మోసపోతాడు. దీంతో వారి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ మోసం ఏంటి.. కష్టాల నుంచి చిరంజీవి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ మూవీలో ప్రధానంగా ఉంటుంది. షరతులు వర్తిస్తాయి సినిమాలో చైతన్య రావ్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ నిరూపించుకున్నారు. మిడిల్‍క్లాస్ మ్యాన్‍గా ఆయన నటనకు ప్రశంసలు వచ్చాయి.
ఆహాలో విద్యా వాసుల అహం
ఇక, విద్యా వాసుల అహం సినిమా ఆహా ఓటీటీలోకి నేరుగా రానుంది. ఈ సినిమా మే 17వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ఈగోలతో సాగే స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. విద్యా వాసుల అహం మూవీలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
టాపిక్