Sharathulu Varthisthai: కరీంనగర్ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయి.. తెలంగాణ యాసపై హీరోయిన్ కామెంట్స్-karimnagar based movie sharathulu varthisthai bhoomi shetty about telangana accent and chaitanya rao ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharathulu Varthisthai: కరీంనగర్ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయి.. తెలంగాణ యాసపై హీరోయిన్ కామెంట్స్

Sharathulu Varthisthai: కరీంనగర్ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయి.. తెలంగాణ యాసపై హీరోయిన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 07, 2024 11:20 AM IST

Actress Bhoomi Shetty About Telangana Accent: 30 వెడ్స్ 21 సిరీసుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావు హీరోగా నటిస్తున్న మరో కొత్త మూవీ షరతులు వర్తిస్తాయి. ఇందులో హీరోయిన్‌గా భూమి శెట్టి నటిస్తోంది. ఇటీవల షరతులు వర్తిస్తాయి నేపథ్యం, తెలంగాణ యాసపై భూమి శెట్టి కామెంట్స్ చేసింది.

కరీంనగర్ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయి.. తెలంగాణ యాసపై హీరోయిన్ కామెంట్స్
కరీంనగర్ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయి.. తెలంగాణ యాసపై హీరోయిన్ కామెంట్స్

Bhoomi Shetty Sharathulu Varthisthai: చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి (అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదల చేసిన షరతులు వర్తిస్తాయి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

షరతులు వర్తిస్తాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ భూమి శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసింది. "ష‌ర‌తులు వ‌ర్తిసాయి ఒక న్యూ ఏజ్ సినిమా. ఈ సినిమా చేసిన మేకర్స్, నటించిన ఆర్టిస్ట్స్ అందరూ యంగ్ టాలెంట్స్. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం మాలాంటి వాళ్లకు వస్తుంది. ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయండి. తక్కువ టైమ్‌లో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నా" అని భూమి శెట్టి కోరింది.

"షరతులు వర్తిస్తాయి ఒక మంచి మూవీ. కరీంనగర్ నేపథ్యంలో చేశాం. నేను తెలంగాణ యాస నేర్చుకుని డైలాగ్స్ చెప్పాను. అందుకు మా హీరో చైతన్య సపోర్ట్ చేశారు. ష‌ర‌తులు వ‌ర్తిసాయి ఈ నెల 15న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. తప్పకుండా చూడండి" అని హీరోయిన్ భూమి శెట్టి పేర్కొంది.

"మంచి ప్రయత్నం చేసినప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ ఎదురైనా తట్టుకుని మా ప్రొడ్యూసర్స్‌ను సేఫ్‌గా ఉంచుతూ ఈ సినిమాను కంప్లీట్ చేశాను. ఈ ప్రాసెస్‌లో నాకు హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి సపోర్ట్‌గా నిలిచారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్. నాకు అండగా నిలబడిన మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా" అని డైరెక్టర్ కుమారస్వామి తెలిపారు.

"ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా థియేట్రికల్ రిలీజ్ మంచి సంస్థల ద్వారా జరుగుతుండటం హ్యాపీగా ఉంది. సినిమా అనేది ఆర్ట్ బిజినెస్. ఇందులో మంచి పాయింట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎంగేజ్ చేసేలా ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా ఉంటుంది. ఈ నెల 15న థియేటర్స్ కు రండి. తప్పకుండా మా మూవీ మీకు నచ్చుతుంది. ష‌ర‌తులు వ‌ర్తిసాయి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇందులో మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండదు" అని కుమారస్వామి చెప్పారు.

"ఒక మంచి సినిమాతో మా సంస్థ లాంఛ్ అవుతుండటం హ్యాపీగా ఉంది. మా ప్రొడక్షన్‌కు ఒక లాంగ్ రన్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ స్టెప్ ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా. మా మూవీని ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ మా ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి 60 థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. మా టీమ్‌కు సపోర్ట్ గా ఉన్న మామిడి హరికృష్ణ, మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్" అని నిర్మాత డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు పేర్కొన్నారు.