తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ghani Movie Review |గని మూవీ రివ్యూ...బాక్సింగ్ పంచ్ కుదరలేదు.

Ghani Movie Review |గని మూవీ రివ్యూ...బాక్సింగ్ పంచ్ కుదరలేదు.

Nelki Naresh HT Telugu

08 April 2022, 13:43 IST

  • కెరీర్‌లో తొలిసారి క్రీడానేప‌థ్య క‌థాంశంతో మెగా హీరో వ‌రుణ్‌తేజ్ చేసిన సినిమా గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్ర‌మోష‌న్స్‌, ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందంటే….

వ‌రుణ్‌తేజ్
వ‌రుణ్‌తేజ్ (twitter)

వ‌రుణ్‌తేజ్

 రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాకు భిన్నమైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ టాలీవుడ్ యువ హీరోల్లో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్నారు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌తి సినిమాలో ప్ర‌యోగాలు చేయ‌డానికే అత‌డు ప్రాధాన్య‌త‌నిస్తుంటాడు. ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించిన త‌న పంథాను మాత్రం వ‌దిలిపెట్ట‌లేదు. మరోసారి ఆ పంథాను అనుసరిస్తూ వ‌రుణ్‌తేజ్ చేసిన చిత్రం ‘గ‌ని’. అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు బాబీ నిర్మాత‌గా అరంగేట్రం చేస్తూ సిద్ధు ముద్ద‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన ‘త‌మ్ముడు’ స్ఫూర్తితో ఈ సినిమా చేశామని ప్ర‌చార వేడుక‌ల్లో వ‌రుణ్ తేజ్ చెప్ప‌డం తో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. మెగా హీరోలు ప్ర‌చారంలో భాగం కావ‌డంతో అంచ‌నాలు పెరిగిపోయాయి. ఆ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా ఈ సినిమా ఉందా?  కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి వ‌రుణ్‌తేజ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

NNS May 14th Episode: అమర్‌పై వశీకరణ మందు.. భాగీపై అరుంధతికి అసూయ.. మనోహరికి చిక్కిన సరస్వతి మేడమ్​!

Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

కథా పరిచయం

విక్రమాదిత్య(ఉపేంద్ర) ఓ బాక్స‌ర్‌. నేష‌న‌ల్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్స్‌కు చేరుకుంటాడు. క‌ప్ గెలిచి స‌రైన స‌దుపాయాలు లేని ఎంతో మంది యువ బాక్స‌ర్స్ కు అండ‌గా నిల‌వాల‌ని క‌ల‌లుకంటాడు. కానీ ఫైన‌ల్స్ ఓడిపోయి ప్రాణాల‌ను కోల్పోతాడు. డ్ర‌గ్స్ వ‌ల్లే అత‌డు ఓడిపోయాడ‌ని తేల‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాక్స‌ర్ల‌పై నిషేదం ప‌డుతుంది. తండ్రిని హీరోగా భావించిన విక్ర‌మాదిత్య కొడుకు గ‌ని(వరుణ్ తేజ్) ఆ అవ‌మానాన్ని త‌ట్టుకోలేక‌పోతాడు. మోస‌గాడి కొడుకు అంటూ అంద‌రూ త‌న‌ను దూషించ‌డంతో తండ్రిపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. బాక్సింగ్ కార‌ణంగా భ‌ర్త ప్రాణాలు పోవ‌డంతో కొడుకు గ‌ని ని ఆట‌కు దూరంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది అత‌డి త‌ల్లి (నదియా). బాక్సింగ్ ఎప్పుడూ ఆడ‌న‌ని అత‌డితో ప్ర‌మాణం చేయించుకుంటుంది. కానీ గ‌ని మాత్రం త‌ల్లికి తెలియ‌కుండా నేష‌న‌ల్స్ బాక్సింగ్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో తండ్రి మోస‌గాడు కాద‌ని బాక్సింగ్ లెజెండ్ ఈశ్వ‌ర్ ప్ర‌సాద్(జగపతిబాబు) కార‌ణంగా ప్రాణాల‌ను కోల్పోయాడ‌నే నిజం గనికి తెలుస్తుంది. ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డ‌మే కాకుండా  నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌నే త‌న క‌ల‌ను గ‌ని ఎలా నేర‌వేర్చుకున్నాడు. అత‌డి ప్ర‌యాణంలో కోచ్ విజ‌యేంద‌ర్ సిన్హా (సునీల్ శెట్టి)ఎలా సాయ‌ప‌డ్డాడు?  ప్రియురాలు మాయ‌ను(సయీ మంజ్రేకర్) గ‌ని పెళ్లి చేసుకున్నాడా? లేదా అన్న‌దే ఈ క‌థ‌

కథా విశ్లేషణ

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల ప‌ట్ల ఈజీగా యువ‌త‌రం ఆకర్షితులవుతారు. అందులో బాక్సింగ్ నేప‌థ్య సినిమాలంటే కావాల్సినంత హీరోయిజాన్ని ప‌డించ‌డానికి అవ‌కాశం దొరుకుతుంది. గ‌ని విష‌యంలో వ‌రుణ్‌తేజ్ అలాగే ఆలోచించి అంగీక‌రించిన‌ట్లుగా క‌నిపిస్తుంది.   

క్రీడా నేప‌థ్య సినిమాల్లో అంతిమంగా హీరోనే గెలుస్తాడ‌న్న‌ది కామ‌న్ పాయింట్‌. గ‌మ్యంలో అత‌డికి ఎదురైన ఛాలెంజెస్‌ను ఎంగేజింగ్‌గా చెప్పే నేర్పు ద‌ర్శ‌కుడికి ఉండాలి. అందులో ఏ మాత్రం త‌డ‌బాటుకు లోనైనా గేమ్ ఫెయిల్ అవుతుంది.  బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌కు ఫాద‌ర్ ఎమోష‌న్ ను జోడించి ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ క‌థ రాసుకున్నారు. తండ్రికి జ‌రిగిన అన్యాయంపై ఓ కొడుకు ఆట ద్వారానే ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడో ఇంటెన్స్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. 

స్ర్కీన్‌ప్లే లో మ్యాజిక్ లేదు

వ‌రుణ్‌తేజ్ లాంటి టాలెంటెడ్ హీరో,  ఉపేంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌శెట్టి లాంటి సీనియ‌ర్ న‌టులు క‌థ విని ఎగ్జైట్ అయ్యి సినిమా ఒప్పుకోవ‌డంతో పాస్ అయిపోతామ‌నే ఓవ‌ర్‌కాన్ఫిడెన్స్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమా చేసిన‌ట్లుగా క‌నిపించింది.  మంచి పాయింట్ ఎంచుకున్నా వాటిని ప్ర‌జెంట్ చేసే బ‌ల‌మైన సీన్ ఒక్క‌టి సినిమాలో క‌నిపించ‌దు. ల‌వ్ సీన్‌, ఫ్యామిలీ ఎపిసోడ్‌, యాక్ష‌న్  ఇలా ప్ర‌థ‌మార్థం ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి పేర్చుకుంటూ వ‌చ్చిన‌ట్లుగా సన్నవేశాలు వస్తుంటాయి.  నాయకానాయికల ల‌వ్‌ట్రాక్ విసుగును తెప్పిస్తుంది. ఒక్క‌టంటే ఒక్క సీన్ కూడా అందంగా చెప్ప‌లేక‌పోయారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఫోర్స్‌డ్‌గా ఉంటాయి. మ‌న‌సుల్ని క‌దిలించే సీన్ క‌నిపించ‌దు.

బాక్సింగ్ ఆడుతున్న‌ట్లుగా త‌ల్లికి తెలియ‌కుండా హీరో దాచ‌డం బాగానే ఉంది.కానీ నేష‌న‌ల్ లెవ‌ల్ వెళ్లేవ‌ర‌కు ఆమెకు ఎలా తెలియలేదన్నది లాజిక్‌ల‌కు అంద‌దు. తండ్రికి కోచ్ అన్యాయం చేశాడ‌నే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ పెద్ద‌గా మెప్పించ‌దు. అందులో ట్విస్ట్ సుల‌భంగానే ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైపోతుంది. ఈశ్వ‌ర్‌ప్ర‌సాద్‌పై హీరో ప్ర‌తీకారం తీర్చుకోవడాన్ని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయారు. బెట్టింగ్ దందా కోసం విల‌న్  క్రియేట్ చేసిన బాక్సింగ్‌లో హీరో విజేత‌గా నిల‌వ‌డం, గనిని ఓడించ‌డానికి విల‌న్ వేసే ఎత్తులన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినవే. వాటిని కొత్తగా రాసుకోలేదు.   ఈశ్వ‌ర్‌ప్ర‌సాద్‌ చేసే మోసాల‌ను బ‌య‌ట‌పెట్టే సీన్ అయితే చాలా సిల్లీగా ఉంటుంది.  ద్వితీయార్థం పూర్తిగా బాక్సింగ్ సీన్స్ కు సినిమాను పరిమితం చేయడంలో ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ సైడ్ ట్రాక్ అయ్యాయి. రెండింటిని స‌రిగా బ్యాలెన్స్ చేయ‌లేక‌పోయారు. 

నటీనటుల పనితీరు

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో తొలి క్రీడానేప‌థ్య చిత్ర‌మిది. డిఫ‌రెంట్ సినిమాల‌తో కెరీర్‌లో ముందుకు సాగాల‌నే అత‌డి ఆలోచ‌న బాగానే ఉన్నా అందుకు త‌గ్గ బ‌ల‌మైన క‌థ దొర‌క‌డం ముఖ్యం. ఇందులో తండ్రిపై ద్వేషం ఉన్న యువ‌కుడిగా, బాక్సింగ్ క్రీడాకారుడిగా డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు. అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీన్స్ బాగున్నాయి. స్టైలిష్ విల‌న్ పాత్ర‌లో చాలా సార్లు క‌నిపించ‌డంతో జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌లో ఎలాంటి వేరియేష‌న్ క‌నిపించ‌లేదు. కోచ్‌గా సునీల్‌శెట్టి పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త‌లేదు. అతిథి పాత్ర‌లో ఉపేంద్ర ఆక‌ట్టుకున్నాడు. కానీ అత‌డి క్యారెక్ట‌ర్‌లో ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాలేదు. హీరోయిన్‌గా స‌యీ మంజ్రేక‌ర్ గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు. న‌ట‌న‌, గ్లామ‌ర్ రెండింటితో నిరాశ‌ప‌రిచింది. 

తమన్ బీజీఎమ్ అదుర్స్

ఈ సినిమాకు త‌మ‌న్ నేప‌థ్య సంగీతం ఒక్క‌టే బ‌లంగా నిలిచింది. త‌న బీజీఎమ్‌తో సినిమాను నిల‌బెట్ట‌డానికి శాయ‌శ‌క్తులా త‌మ‌న్ క‌ష్ట‌ప‌డ్డాడు. క‌థ‌కు అడ్డంకి అనే ఆలోచ‌న‌తో పాట‌లు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. వ‌చ్చే రెండు పాట‌లు బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ గానే క‌నిపించాయి. అబ్బూరి ర‌వి డైలాగ్స్ లో మెరుపులు లేవు.  ఈ సినిమాతో అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లుబాబీ నిర్మాత‌గా మారారు. సిద్దు ముద్ద‌తో క‌లిసి నిర్మించారు. నిర్మాత‌గా తొలి సినిమాతోనే భారీ హిట్‌ను త‌మ ఖాతాలో వేసుకోవాల‌నే వారి ప్ర‌య‌త్నం నెర‌వేర‌డం క‌ష్ట‌మే.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ఇది. జీవం లేని క‌థ‌, రొటీన్ స్ర్కీన్‌ప్లేతో తెర‌కెక్కిన ఈ సినిమాను రెండున్న‌ర గంట‌లు భ‌రించ‌డం క‌ష్ట‌మే.

రేటింగ్‌: 2/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం