తెలుగు న్యూస్  /  Entertainment  /  Varun Tej And Praveen Sattaru Movie Title Announcement On January 19

Varun Tej Movie Update: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ మూవీ.. టైటిల్‌ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

17 January 2023, 11:26 IST

    • Varun Tej Movie Update: టాలీవుడ్ వైవిధ్య చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
వరుణ్ తేజ్ కొత్త చిత్రం
వరుణ్ తేజ్ కొత్త చిత్రం

వరుణ్ తేజ్ కొత్త చిత్రం

Varun Tej Movie Update: ఎల్బీడబ్ల్యూ, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో గతేడాది ది ఘోస్ట్ అనే సినిమా విడుదలైంది. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా ఆశించిన విజయం అందుకోనప్పటికీ.. మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించారు. వీటీ12(VT12) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. జనవరి 19న ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించడంతో పోటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటీ, నటులు ఇతర సమాచారం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

వరుణ్ తేజ్ గతేడాది గని, ఎఫ్3 సినిమాలతో సందడి చేశాడు. ఇందులో గని సినిమా ఫ్లాప్ కాగా.. ఎఫ్3 మాత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే వరుణ్ తేజ్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. దీంతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతోనైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.