తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannaah-vijay Varma: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రైవ్‌కు వెళ్లిన తమన్నా.. ముంబయి రోడ్లపై కెమెరాకు చిక్కిన జోడీ!

Tamannaah-Vijay Varma: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రైవ్‌కు వెళ్లిన తమన్నా.. ముంబయి రోడ్లపై కెమెరాకు చిక్కిన జోడీ!

17 January 2023, 10:28 IST

    • Tamannaah-Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా.. తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి సందడి చేసింది. గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరిద్దరూ ముంబయి బాంద్రా ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కారు.
తమన్నా-విజయ్ వర్మ
తమన్నా-విజయ్ వర్మ

తమన్నా-విజయ్ వర్మ

Tamannaah-Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా విపరీతంగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈ ముద్దుగుమ్మ డేటింగ్‌లో ఉందంటూ ఊహాగానాలు వినిపిపించాయి. వీటిని నిరూపిస్తూ వీరిద్దరూ ఇటీవల గోవాలో నూతన సంవత్సర వేడుకలను కలిసి చేసుకున్నారు. అంతేకాకుండా ఇద్దరూ ముద్దుపెట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియా వైరలైంది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఇద్దరూ పలు ప్రదేశాల్లో కలిసి కనిపించారు. తాజాగా మరోసారి వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు.

ట్రెండింగ్ వార్తలు

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Prasanth Ranveer Movie: ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా..

OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న 12th ఫెయిల్ హీరో కొత్త సినిమా: డేట్ ఖరారు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

ముంబయిలో బాంద్రా ప్రాంతంలో తమన్నా-విజయ్ వర్మ ఒకే కారులో కనిపించారు. ఇరువురు క్యాజువల్ దుస్తులను ధరించి సందడి చేశారు. తమన్నా నలుపు రంగు హుడీతో పాటు చిన్న స్కర్టు, మ్యాచింగ్ షూస్‌తో దర్శనమివ్వగా.. విజయ్ వర్మ బ్లూ హుడీ, బ్రౌన్ ప్యాంట్‌లో మెరిశాడు. ఇద్దరు లంచ్ డేట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

అంతకుముందు రోజే తమన్నా-విజయ్ వర్మ ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారు. బ్లూకటౌట్ దుస్తుల్లో తమన్నా అప్సరసలా మెరవగా.. విజయ్ వర్మ కలర్‌ఫుల్ జాకెట్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కెమేరాకు ఫోజులిచ్చారు. సన్నిహితంగా మెలిగిన వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తమన్నా 2005లో చిత్రసీమలో అరంగేట్రం చేసినప్పటి నుంచి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ గతేడాది ఎఫ్3లో నటించి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇది కాకుండా గుర్తుందా శీతాకాలం అనే మరో సినిమాలో నటించగా.. అది అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. మరోపక్క బాలీవుడ్‌లోనూ గత సంవత్సరం బబ్లీ బౌన్సర్ చిత్రంతో సందడి చేసింది.

మరోపక్క విజయ్ వర్మ 2012లో చిట్టగాంగ్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. అయితే 2019లో జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన గల్లీ బాయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డార్లింగ్స్ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం కరీనా కపూర్ నటిస్తున్న ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం