తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trp Ratings Of Telugu Programs: తెలుగులో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవే.. కొనసాగుతున్న ఈటీవీ హవా

TRP Ratings of Telugu Programs: తెలుగులో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవే.. కొనసాగుతున్న ఈటీవీ హవా

Hari Prasad S HT Telugu

31 May 2023, 15:32 IST

    • TRP Ratings of Telugu Programs: తెలుగులో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవే. వీటిలో ఈటీవీ హవా కొనసాగుతోంది. టాప్ 10లో చాలా వరకూ స్టార్ మా, ఈటీవీ ప్రోగ్రామ్సే ఉన్నాయి.
ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రాామా కంపెనీ
ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రాామా కంపెనీ

ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రాామా కంపెనీ

TRP Ratings of Telugu Programs: తెలుగు ఛానెల్స్ లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఏవి? సాధారణంగా సీరియల్స్ విషయంలో మొత్తం స్టార్ మా, జీ తెలుగు హవా కనిపిస్తుంది. అయితే ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఈటీవీ చాలా కాలంగా తన పట్టు నిలుపుకుంటోంది. ఇందులో వచ్చే కామెడీ, డ్యాన్స్, ఇతర రియాల్టీ షోలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

అందుకే టీఆర్పీ రేటింగ్స్ పరంగానూ చాలా వరకూ ఈటీవీకి చెందిన ప్రోగ్రామ్సే ఉంటున్నాయి. తాజాగా బార్క్ ఇండియా వెబ్‌సైట్ రిలీజ్ డేటా ప్రకారం.. మే 13 నుంచి మే 19తో ముగిసిన వారానికిగానూ టీఆర్పీ రేటింగ్స్ ఇక్కడ ఇస్తున్నాం. టాప్ ర్యాంక్ లో స్టార్ మాకు చెందిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఉన్నా.. టాప్ 10లో మాత్రం ఈటీవీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

టాప్ 10లో ఏకంగా ఏడు ప్రోగ్రామ్స్ ఈటీవీకి చెందినవే కావడం విశేషం. ఇక స్టార్ మా నుంచి రెండు ప్రోగ్రామ్స్, మరొకటి జీ తెలుగు ప్రోగ్రామ్ ఈ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

టాప్ 12 టీఆర్పీ రేటింగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవే

ఆదివారం విత్ స్టార్ మా పరివారం (స్టార్ మా) 4.57

శ్రీదేవి డ్రామా కంపెనీ (ఈటీవీ) 4.50

సిక్త్స్ సెన్స్ (స్టార్ మా) 3.76

ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్ (ఈటీవీ) 2.39

సూపర్ క్వీన్ సీజన్ 2 (జీ తెలుగు) 2.31

జబర్దస్త్ (ఈటీవీ) 2.25

ఢీ 15 (ఈటీవీ) 2.01

సుమ అడ్డా (ఈటీవీ) 1.49

పాడుతా తీయగా (ఈటీవీ) 1.41

ఆడవాళ్లూ మీకు జోహార్లు (ఈటీవీ) 0.92

ఓంకారం (జీ తెలుగు) 0.83

అలా మొదలైంది (ఈటీవీ) 0.74

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.