తెలుగు న్యూస్  /  Entertainment  /  Thalapathy Vijay Movie Varisu Ranjithame Telugu Version Released

Ranjithame Telugu Version Release: రంజితమే తెలుగు వెర్షన్ కూడా అదిరింది.. సాంగ్ వినేయండి మరీ

30 November 2022, 9:24 IST

    • Ranjithame Telugu Version Release: విజయ్ హీరోగా నటించిన వారిసు చిత్రం నుంచి ఇటీవలే రంజితమే సాంగ్ విడుదలై సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. తెలుగులో అనురాగ్ కులకర్ణ, ఎంఎం మానసి ఆలపించారు.
రంజితమే తెలుగు సాంగ్ వచ్చేసింది
రంజితమే తెలుగు సాంగ్ వచ్చేసింది

రంజితమే తెలుగు సాంగ్ వచ్చేసింది

Ranjithame Telugu Version Release: ఇళయ దళపతి విజయ్ హీరోగా.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారిసు. ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రంజితమే అనే సాంగ్ విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అయితే కేవలం తమిళం వెర్షన్ మాత్రమే విడుదలైన ఈ పాట.. తాజాగా తెలుగు వెర్షన్‌లోనూ వచ్చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

రంజితమే తెలుగు వెర్షన్ కూడా అదిరిపోయింది. ఏదో అనువాద పాటలాగా కాకుండా.. అర్థమవంతమైన తెలుగు పాట మాదిరిగా ఉంది. బొండు మల్లే చెండు తెచ్చి అంటూ ఆరంభమయ్యే ఈ పాటు శ్రోతలను అలరిస్తోంది. ఈ సాంగ్‌ను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాయగా.. అనురాగ్ కులకర్ణ, ఎంఎం మానసి ఆలపించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. వీరితో పాటు ప్రకాశ్ రాజ్, జయసుధ, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటిగ్ బాధ్యతలు తీసుకోగా.. కార్తిక్ పలనీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ బెల్టులో విజయ్‌కున్న పాపులారిటీ మేరకు అక్కడ కూడా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో ఎక్కువ మంది ఆత్రుతగా చూస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ శింబు కూడా ఓ సాంగ్ పాడబోతున్నట్లు తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.