Trouble for Vijay Varisu: చిక్కుల్లో విజయ్ వారసుడు మూవీ.. ఇదీ కారణం!
Trouble for Vijay Varisu: తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న వారసుడు మూవీ చిక్కుల్లో పడింది. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమాకు యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నోటీసులు పంపించింది.
Trouble for Vijay Varisu: తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దళపతి విజయ్. అయితే ఈ మూవీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. అనుమతి లేకుండా షూటింగ్‌లో ఏనుగులను వినియోగించారన్న ఆరోపణలు మేకర్స్‌పై ఉన్నాయి. దీంతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
అధికారుల అనుమతి లేకుండా సినిమా షూటింగ్‌లలో జంతువులను వాడటం నేరం. దీంతో ఈ అంశంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ వారసుడు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు గత దీపావళి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద సుత్తిని పట్టుకొని కనిపించారు. యాక్షన్-బ్లాక్ ని సూచిస్తున్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
క్లాసియెస్ట్ బెస్ట్ లుక్ లో విజయ్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్ లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.
భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.