Rashmika Mandanna Goodbye trailer: రష్మికా మందన్నా, అమితాబ్ గుడ్‌బై ట్రైలర్ వచ్చేసింది
Rashmika Mandanna Goodbye trailer: రష్మికా మందన్నా, అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్‌బై మూవీ ట్రైలర్ మంగళవారం (సెప్టెంబర్ 6) రిలీజైంది. అన్ని ఎమోషన్స్ కలగలిసిన ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
Rashmika Mandanna Goodbye trailer: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా ఇప్పుడు బాలీవుడ్‌లో గుడ్‌బై అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన గుడ్‌బై మూవీ ట్రైలర్ మంగళవారం (సెప్టెంబర్ 6) రిలీజైంది. ఈ ట్రైలర్‌ను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
"మా గుడ్‌బై బేబీలోని కొంత పార్ట్ ఇప్పుడు మీ సొంతమవుతోంది. ఇది నాకెంతో స్పెషల్. ఈ ట్రైలర్ మీకు, మీ ఫ్యామిలీకి నచ్చుతుందని అనుకుంటున్నా" అంటూ రష్మికా ఈ ట్రైలర్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. గుడ్‌బై ఒక ఫ్యామిలీ డ్రామెడీ. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన కథాంశంగా తీసుకున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇందులో రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో అమితాబ్, నీనా గుప్తా నటించారు.
తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు ఫైట్ చేస్తుంది. వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయమిది.. అయినా ఇది బర్త్‌డే కాదు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగి చేయడానికి అని ఆ తండ్రి వాదిస్తాడు. మొత్తానికి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఓ మనిషిని సాగనంపే సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా లేక సాంప్రదాయాన్నా అన్న చర్చను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు.
ఒక రకంగా ప్రతి ఇంట్లో కనిపించే సున్నితమైన అంశాలనే కథాంశంగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. క్వీన్ మూవీ ఫేమ్ వికాస్ బెహల్ గుడ్‌బై మూవీని డైరెక్ట్ చేశాడు. ఏక్తాకపూర్ నిర్మాత. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ మొత్తం కామెడీ, డ్రామాతో సరదాగా గడిచిపోతుంది. రష్మికా మందన్నాకు బాలీవుడ్‌లో ఈ గుడ్‌బై తొలి మూవీ కానుంది.
దీని తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నూ మూవీలోనూ కనిపిస్తోంది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తోంది. ఇక గుడ్‌బై మూవీ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.