తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Programs Trp Ratings: టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న తెలుగు ప్రోగ్రామ్స్ ఇవే.. ఈటీవీ, స్టార్ మా హవా

Telugu Programs TRP Ratings: టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న తెలుగు ప్రోగ్రామ్స్ ఇవే.. ఈటీవీ, స్టార్ మా హవా

Hari Prasad S HT Telugu

01 May 2023, 19:12 IST

    • Telugu Programs TRP Ratings: టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న తెలుగు ప్రోగ్రామ్స్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో ఈటీవీ, స్టార్ మా హవా కొనసాగించాయి. టాప్ 10లో ఉన్న ఆ ప్రోగ్రామ్స్ ఏంటో మీరూ చూడండి.
ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ
ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ (mallemala tv twitter)

ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ

Telugu Programs TRP Ratings: తెలుగు ఛానెల్స్ లో టెలికాస్ట్ అవుతున్న టాప్ ప్రోగ్రామ్స్ ఏవో తెలుసా? ఈటీవీతోపాటు స్టార్ మా, జీ తెలుగు, జెమినిలాంటి వాటిలో ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్నో ప్రోగ్రామ్స్, రియాల్టీ షోలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ కూడా రిలీజయ్యాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు వచ్చిన రేటింగ్స్ ఇవి.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

టీవీ సీరియల్స్ లో స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానెల్స్ సత్తా చాటుతుండగా.. ప్రోగ్రామ్స్ విషయానికి వచ్చే సరికి ఈటీవీ ముందుంటోంది. టాప్ ప్రోగ్రామ్ తోపాటు టాప్ 10లో ఏడు ఈటీవీకి చెందిన ప్రోగ్రామ్సే ఉండటం విశేషం. ఇక మిగిలిన వాటిలో రెండు స్టార్ మా, మరొకటి జీ తెలుగులో వచ్చే ప్రోగ్రామ్స్. అధికారిక బార్క్ (BARC) ఇండియా వెబ్‌సైట్ రిలీజ్ చేసిన రేటింగ్స్ ఇవి.

టాప్ 10 ప్రోగ్రామ్స్ ఇవీ

1. శ్రీదేవీ డ్రామా కంపెనీ (4.44 టీఆర్పీ) - ఈటీవీ

2. సిక్త్స్ సెన్స్ (4.40 టీఆర్పీ) - స్టార్ మా

3. ఆదివారం విత్ స్టార్ మా పరివారం (3.64 టీఆర్పీ) - స్టార్ మా

4. జబర్దస్త్ (2.52 టీఆర్పీ) - ఈటీవీ

5. ఎక్స్‌ట్రా జబర్దస్త్ (2.41 టీఆర్పీ) - ఈటీవీ

6. సరిగమప ఛాంపియన్‌షిప్ (1.92 టీఆర్పీ) - జీ తెలుగు

7. ఢీ 15 (1.85) - ఈటీవీ

8. సుమా అడ్డా (1.62) - ఈటీవీ

9. అలా మొదలైంది (1.35) - ఈటీవీ

10. పాడుతా తీయగా (1.30) - ఈటీవీ

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.