Telugu TV Serials TRP Ratings: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ సీరియలే టాప్-telugu tv serials trp ratings are here and brahmamudi tops the list again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Tv Serials Trp Ratings: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ సీరియలే టాప్

Telugu TV Serials TRP Ratings: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ సీరియలే టాప్

Hari Prasad S HT Telugu
Apr 10, 2023 09:13 PM IST

Telugu TV Serials TRP Ratings: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మళ్లీ బ్రహ్మముడి సీరియలే టాప్ లో నిలవగా.. ఎప్పటిలాగే స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ డామినేట్ చేశాయి.

స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్
స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్

Telugu TV Serials TRP Ratings: తెలుగు రాష్ట్రాలలో సీరియల్స్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా స్టార్ మా, జీ తెలుగులో వచ్చే సీరియల్స్ ను పెద్ద సంఖ్యలో చూస్తారు. మరి ఈ సీరియల్స్ లో టాప్ లో నిలిచేవి ఏవి?

ఏ సీరియల్ ను ఎక్కువ మంది చూస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదే టీఆర్పీ రేటింగ్స్. తాజాగా ఏప్రిల్ 5న తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

ఈ లేటెస్ట్ రేటింగ్స్ లోనూ స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్ టాప్ లో నిలిచింది. వరుసగా నాలుగు వారాలుగా ఈ సీరియల్ కే ఎక్కువ రేటింగ్ లభిస్తుండటం విశేషం. ఇక స్టార్ మాలో ఈ మధ్యే మొదలైన నాగ పంచమి సీరియల్ ఏకంగా రెండోస్థానంలో నిలిచింది.

అంతేకాదు టాప్ 10లో మరోసారి మొత్తం స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే ఉండటం విశేషం. ఇక ఈసారి టాప్ 5లో మొత్తం స్టార్ మా సీరియల్స్ కే చోటు దక్కింది. మార్చి 25 నుంచి మార్చి 31తో ముగిసిన వారానికి సంబంధించిన రేటింగ్స్ ఇవి.

తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

1. బ్రహ్మముడి (స్టార్ మా) - 13.41

2. నాగ పంచమి (స్టార్ మా) - 12.57

3. కృష్ణా ముకుందా మురారి (స్టార్ మా) - 11.94

4. గుప్పెడంత మనసు (స్టార్ మా) - 10.85

5. మల్లీ (స్టార్ మా) -9.03

6. త్రినయని (జీ తెలుగు) - 7.75

7. ప్రేమ ఎంత మధురం (జీ తెలుగు) - 7.27

8. పడమటి సంధ్యారాగం (జీ తెలుగు) - 7.02

9. అమ్మాయి గారు (జీ తెలుగు) - 6.22

10. నువ్వు నేను ప్రేమ (స్టార్ మా) - 6.20

IPL_Entry_Point

సంబంధిత కథనం