Krishnamma Kalipindhi Iddarini: స్టార్ మాలో కొత్త సీరియల్.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. ఎప్పటి నుంచంటే..-krishnamma kalipindhi iddarini is the new serial in star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishnamma Kalipindhi Iddarini: స్టార్ మాలో కొత్త సీరియల్.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. ఎప్పటి నుంచంటే..

Krishnamma Kalipindhi Iddarini: స్టార్ మాలో కొత్త సీరియల్.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. ఎప్పటి నుంచంటే..

Hari Prasad S HT Telugu
Apr 04, 2023 08:27 PM IST

Krishnamma Kalipindhi Iddarini: స్టార్ మాలో కొత్త సీరియల్ రాబోతోంది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అంటూ వస్తున్న ఈ సీరియల్ ప్రోమోను తాజాగా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది.

త్వరలో స్టార్ మాలో రానున్న కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
త్వరలో స్టార్ మాలో రానున్న కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

Krishnamma Kalipindhi Iddarini: తెలుగు వాళ్లు ఎంతగానో ఆదరించే స్టార్ మా ఛానెల్ లో మరో కొత్త సీరియల్ రానుంది. ఈ సీరియల్ పేరు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 4) ఈ సీరియల్ ప్రోమోను ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. తమ అధికారిక ట్విటర్ అకౌంట్ లో స్టార్ మా ఈ ఛానెల్ ప్రోమోను పోస్ట్ చేసింది.

ఈ ప్రోమోలో సీరియల్ లోని లీడ్ రోల్స్ ను పరిచయం చేశారు. హీరో, హీరోయిన్ గుడిలో కలుసుకుంటారు. దేవుడికి హీరో దండం పెట్టుకుంటుండగా అతడు వేసుకున్న చున్నీ పక్కనే ఉన్న దీపానికి అంటుకొని మంటల్లో చిక్కుకుంటుంది. అది చూసిన హీరోయిన్ వెంటనే మంటలు ఆర్పుతుంది. ఆ తర్వాత గుడిలోనే ఆమె అందరికీ ప్రసాదాలు పంచి పెడుతూ ఉంటుంది.

హీరో ఆమె దగ్గరికి వెళ్లి ప్రసాదం తీసుకొని బయటకు వెళ్తాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత గానీ అసలు విషయం తెలియదు. అదేంటంటే.. ఇందులో హీరోకి కళ్లు కనిపించవు. ప్రేమ గుడ్డిది అంటారు.. మరి కళ్లు లేని వాళ్లకు మాత్రం ప్రేమించే హక్కు ఉంటుంది కదా.. ఓ ముచ్చటైన ప్రేమ కథ అంటూ ఈ ప్రోమోను ముగించారు. ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ త్వరలోనే ప్రారంభం కానుందని స్టార్ మా చెప్పింది.

ఇప్పటికే తెలుగు సీరియల్స్ విషయంలో స్టార్ మా టాప్ లో ఉంది. గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి, ఎన్నెన్నో జన్మల బంధం, కృష్ణా ముకుందా మురారిలాంటి సూపర్ హిట్ సీరియల్స్ ఇందులో వస్తున్నాయి. ఈ మధ్యే నాగ పంచమి అనే కొత్త సీరియల్ కూడా ప్రారంభమైంది. ఇక ఇప్పుడీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ప్రోమో కూడా చాలా ఇంట్రెస్టింగా ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం