Naga Panchami Serial in star maa: స్టార్ మాలో కొత్త సీరియల్.. నాగ పంచమి ఎప్పటి నుంచి రాబోతోందంటే..
Naga Panchami Serial in star maa: స్టార్ మాలో కొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు నాగ పంచమి. తాజాగా ఈ కొత్త సీరియల్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసిందీ ఛానెల్.
Naga Panchami Serial in star maa: స్టార్ మా ఛానెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ ఛానెల్లో త్వరలోనే మరో సీరియల్ ప్రారంభం కాబోతోంది. పంచమి అని స్టార్ జల్సాలో వచ్చే బెంగాలీ సీరియల్ కు ఇది రీమేక్. ఈ కొత్త సీరియల్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందో తాజాగా స్టార్ మా తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది.
కొన్ని రోజులుగా ఈ సీరియల్ ప్రోమో కూడా వస్తోంది. దర్శిని గౌడ, పృథ్వీ ప్రిన్స్ శెట్టి ఈ కొత్త సీరియల్ లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇక ప్రియాంకా శివన్న, మేక రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కొత్త సీరియల్ ను ప్రొడ్యూస్ చేసింది.
నాగపంచమి ఎప్పటి నుంచి అంటే..
నాగ పంచమి సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్ వచ్చే సోమవారం (మార్చి 27) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతి రోజూ రాత్రి 8 నుంచి 8.30 వరకు ప్రసారం కానున్నట్లు స్టార్ మా వెల్లడించింది. ఈ సీరియల్ ను స్టార్ మాతోపాటు హాట్‌స్టార్ ఓటీటీలోనూ చూడొచ్చు. అంతేకాదు హాట్ స్టార్ లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ సీరియల్ ప్రోమోను కొన్ని రోజుల కిందట స్టార్ మా రిలీజ్ చేసింది. పగను మరచి ప్రేమను పంచే ఓ అమ్మాయి కథే ఈ నాగ పంచమి అంటూ సీరియల్ లోని లీడ్ క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు. పాములను చంపకుండా కాపాడే పాత్రలో హీరోయిన్.. అదే పాముల విషం నుంచి విరుగుడు తయారు చేసి వాటిని చంపేసే పాత్రలో హీరో కనిపిస్తాడు. విరుద్ధమైన మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా ఏర్పడతాయన్నదే నాగ పంచమి సీరియల్.
సంబంధిత కథనం