తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamannaah Shares Rumoured Boyfriend Vijay Verma Pics On Instagram

Tamannaah - Vijay Verma: బాయ్‌ఫ్రెండ్‌పై త‌మ‌న్నా పోస్ట్ - మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన డేటింగ్ వార్త‌లు

24 February 2023, 10:19 IST

  • Tamannaah - Vijay Verma: ఎమ్‌సీఏ ఫేమ్ విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా కొన్నాళ్లుగా బాలీవుడ్ స‌ర్కిల్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా విజ‌య్ వ‌ర్మపై త‌మ‌న్నా ప్ర‌శంస‌లు కురిపిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మ‌న్నా
త‌మ‌న్నా

త‌మ‌న్నా

Tamannaah - Vijay Verma: ఎమ్‌సీఏ యాక్ట‌ర్ విజ‌య్ వ‌ర్మ‌తో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా డేటింగ్‌లో ఉన్న‌ట్లు కొంత‌కాలంగా పుకార్లుషికారు చేస్తోన్నాయి. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల్ని గోవాలో విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి జ‌రుపుకున్న‌ది త‌మ‌న్నా. ఆ వేడుక‌ల్లో విజ‌య్‌కి ముద్దు ఇస్తూ త‌మ‌న్నా క‌నిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Trivikram: స్టార్ డైరెక్టర్ కొడుకు హీరోగా ఉషా పరిణయం.. ఐటమ్ సాంగ్ షూట్‌లో దర్శకుడు త్రివిక్రమ్

Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Jathi Ratnalu 2: జాతి రత్నాలు 2 అప్పుడే! అప్డేట్ ఇచ్చిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్

ఈ ఫొటోలు వైర‌ల్‌గా మార‌డంతో త‌మ‌న్నా, విజ‌య్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది. ఆ త‌ర్వాత విజ‌య్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను త‌మ‌న్నా షేర్ చేయ‌డంతో వీరిద్ద‌రి ప్రేమ బంధం నిజ‌మే అంటూ కామెంట్స్ వినిపించాయి. తాజాగా విజ‌య్ వ‌ర్మ ఫొటోల‌ను మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది త‌మ‌న్నా. అంతేకాకుండా అత‌డిపై ప్ర‌శంస‌లు కురిపించింది.

విజ‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ద‌హాడ్ సిరీస్ బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు సోనాక్షి సిన్హాతో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రీమా క‌గ్తి, జోయా అక్త‌ర్‌ల‌తో క‌లిసి విజ‌య్ వ‌ర్మ హాజ‌ర‌య్యాడు. ఈ సిరీస్‌కు ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అత‌డి పోస్ట్‌ను త‌మ‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

విజ‌య్ వ‌ర్మ‌తో పాటు మిగిలిన టీమ్‌ను అభినందించింది. విజ‌య్ వ‌ర్మ పోస్ట్‌ను త‌మ‌న్నా షేర్ చేయ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా క‌లిసి ల‌స్ట్ స్టోరీస్ -2 లో న‌టిస్తోన్నారు. ఈ అంథాల‌జీ సినిమా స‌మ‌యంలోనే వీరిమ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్‌సీఏ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్ వ‌ర్మ‌. ఆ త‌ర్వాత బాలీవుడ్ బాట ప‌ట్టాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.