Mrunal Thakur in Lust Stories Sequel: ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో మృణాల్‌ ఠాకూర్‌, త‌మ‌న్నా-mrunal thakur and tamannaah to play female leads in lust stories sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mrunal Thakur And Tamannaah To Play Female Leads In Lust Stories Sequel

Mrunal Thakur in Lust Stories Sequel: ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో మృణాల్‌ ఠాకూర్‌, త‌మ‌న్నా

Nelki Naresh Kumar HT Telugu
Oct 20, 2022 09:45 AM IST

Mrunal Thakur in Lust Stories Sequel: ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటు ఈ సీక్వెల్‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారంటే...

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

Mrunal Thakur in Lust Stories Sequel: 2018లో నాలుగు క‌థ‌ల‌తో అంథాల‌జీ సినిమాగా తెర‌కెక్కిన ల‌స్ట్ స్టోరీస్ క్రిటిక‌ల్‌గా ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. మోడ్ర‌న్ రిలేష‌న్‌షిప్స్ బ్యాక్‌డ్రాప్‌లో బోల్డ్ క‌థాంశంతో ల‌స్ట్ స్టోరీస్‌ను ద‌ర్శ‌కులు అనురాగ్ క‌శ్య‌ప్‌, దిబాక‌ర్ బెన‌ర్జీ, క‌ర‌ణ్ జోహార్‌, జోయా అక్త‌ర్ తెర‌కెక్కించారు. వైవాహిక బంధంలో మ‌హిళ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తి, భ‌యాల‌ను బోల్డ్ పంథాలో తెర‌కెక్కించిన తీరు అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇందులోని సీన్స్‌పై కొంద‌రు అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేశారు. ఈ అంథాల‌జీ సినిమాలో కైరా అద్వాణీ, రాధికా ఆప్టే యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా ల‌స్ట్ స్టోరీస్‌కు సీక్వెల్‌ను తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సీక్వెల్‌లో సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్ తో పాటు త‌మ‌న్నా, కాజోల్, నీనా గుప్తా, అమృతా సుభాష్‌, విజ‌య్ వ‌ర్మ‌, తిలోత్త‌మా షోమ్‌, అంగ‌ద్‌ బేడీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ల‌స్ట్ స్టోరీస్ సీజ‌న్ 2కు అమిత్ శ‌ర్మ‌, కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, ఆర్ బాల్కీ, సుజ‌య్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. సీజ‌న్ కూడా మ‌హిళ‌ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగ‌నున్న‌ట్లు, స‌మాజంలోని కొన్ని అపోహ‌ల్ని ఇందులో మోడ్ర‌న్ స్టైల్‌లో చెప్ప‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ల‌స్ట్ స్టోరీస్ సీజ‌న్ -2కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ఆంథాల‌జీ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు తెలిసింది. ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రీలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point

టాపిక్