Tamannaah - Rajinikanth: ర‌జ‌నీకాంత్‌తో ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న‌ త‌మ‌న్నా - కోలీవుడ్‌లోకి రీఎంట్రీ-tamannaah re entry into kollywood after three years with rajinikanth jailer movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamannaah Re Entry Into Kollywood After Three Years With Rajinikanth Jailer Movie

Tamannaah - Rajinikanth: ర‌జ‌నీకాంత్‌తో ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న‌ త‌మ‌న్నా - కోలీవుడ్‌లోకి రీఎంట్రీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 20, 2023 07:49 AM IST

Tamannaah - Rajinikanth: కెరీర్‌లో తొలిసారి కోలీవుడ్ అగ్ర‌హీరో ర‌జ‌నీకాంత్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై రొమాన్స్‌ చేయ‌బోతున్న‌ది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. జైల‌ర్ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

త‌మ‌న్నా
త‌మ‌న్నా

Tamannaah - Rajinikanth: ప‌ద్దెనిమిదేళ్ల సినీ ప్ర‌యాణంలో కోలీవుడ్‌, టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం మాత్రం ఆమెకు ద‌క్క‌లేదు. జైల‌ర్ సినిమాతో త‌మ‌న్నా క‌ల తీర‌నుంది. ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం జైల‌ర్‌.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ప్ర‌క‌టించింది. త‌మ‌న్నా గ్లామ‌ర్ స్టిల్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. జైల‌ర్ సెట్స్‌లో త‌మ‌న్నా అడుగుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది.

జైల‌ర్ సినిమాతో దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది త‌మ‌న్నా. చివ‌ర‌గా 2019లో విశాల్‌ యాక్ష‌న్‌ సినిమాతో కోలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది త‌మ‌న్నా. ఆ త‌ర్వాత కోలీవుడ్‌కు దూర‌మైన త‌మ‌న్నా తెలుగులోనే ఎక్కువ‌గా సినిమాలు చేసింది.

కాగా జైల‌ర్ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్‌లాల్‌, క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ‌, సునీల్ కూడా జైల‌ర్‌లో న‌టిస్తోన్నారు. జైల‌ర్ సినిమాలో ముత్తువేల్ పాండ్య‌న్ అనే పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న జైల‌ర్ రిలీజ్ కానుంది.

మ‌రోవైపు త‌మ‌న్నా ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న భోళాశంక‌ర్ సినిమా చేస్తోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈసినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్