తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunny Leone First Look From Ginna: జిన్నాలో రేణుకగా సన్నీ ఫస్ట్‌ లుక్‌ చూశారా?

Sunny Leone First Look from Ginna: జిన్నాలో రేణుకగా సన్నీ ఫస్ట్‌ లుక్‌ చూశారా?

HT Telugu Desk HT Telugu

10 August 2022, 20:14 IST

    • Sunny Leone First Look from Ginna: మంచు విష్ణు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న జిన్నా మూవీ నుంచి మరో క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఈసారి రేణుకగా హాట్ బాంబ్‌ సన్నీ లియోన్‌ ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది.
జిన్నా మూవీలో సన్నీ లియోన్
జిన్నా మూవీలో సన్నీ లియోన్

జిన్నా మూవీలో సన్నీ లియోన్

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు జిన్నా అనే ఓ వెరైటీ టైటిల్‌తో మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచి ఇప్పటి వరకూ అన్నీ కాస్త వెరైటీగా ప్లాన్‌ చేస్తున్న మేకర్స్‌ తాజాగా ఈ మూవీలో సన్నీ లియోన్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. సోమవారమే (ఆగస్ట్‌ 8) పచ్చళ్ల స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన మేకర్స్‌.. ఇప్పుడు రేణుక పాత్రలో కనిపిస్తున్న సన్నీ లుక్‌ను రివీల్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Arya@20 Years: ఆర్య మూవీకి 20 ఏళ్లు.. జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

SIT Telugu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎక్క‌డ‌...ఎప్పుడంటే?

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

ఈ సినిమాలో గాలి నాగేశ్వర్‌రావు క్యారెక్టర్‌లో కనిపిస్తున్న విష్ణు సరసన పాయల్, సన్నీ కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమాకు మొదట గాలి నాగేశ్వర్‌రావు అనే టైటిల్ అనుకున్నా.. ఆ తర్వాత దానినే షార్ట్ ఫామ్‌లో జిన్నాగా మార్చినట్లు మొదట్లోనే ప్రకటించారు. నిజానికి టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఫన్నీగానే చేశారు. ఆ తర్వాత జిన్నాగా విష్ణు ఫస్ట్ లుక్‌ను కూడా ఓ ఫన్నీ వీడియోతో పరిచయం చేశారు.

ఇషాన్‌ సూర్య ఈ మూవీకి డైరెక్టర్‌. వెరైటీగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వీళ్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకూ వచ్చిన ఫస్ట్‌ లుక్స్‌ అన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా హాట్‌బాంబ్‌ సన్నీ లుక్‌కు ఫిదా అవుతున్నారు. ఈ శృంగార తార పక్కా మోడర్న్‌ లుక్‌లో ఓ పొట్టి స్కర్ట్‌ వేసుకొని కనిపిస్తోంది. ఇంతకుముందు పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్‌పుత్ ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించింది.

ఆమెకు పూర్తి కాంట్రాస్ట్‌గా సన్నీ ఇలా హాట్‌ లుక్‌తో అదరగొట్టింది. ఆ లెక్కన ఈ ఇద్దరు హీరోయిన్లతో విష్ణు స్క్రీన్‌పై ఎలా రొమాన్స్‌ చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాను మంచు విష్ణుయే ప్రొడ్యూస్‌ చేస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా.. ప్రభుదేవ, ప్రేమ్‌ రక్షిత్‌, గణేష్‌ ఆచార్యలాంటి వాళ్లు కొరియోగ్రఫీ చేస్తుండటం విశేషం. ఈ జిన్నా మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్‌ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.