Chiru And Salman Song | చిరు-సల్మాన్ పాటకు ప్రభుదేవా ఆట.. స్క్రీన్లు బ్లాస్టే
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిరు-సల్మాన్‌పై ఈ పాటను చిత్రీకరించనున్నారు.
ఇటీవల ఆచార్య సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. తర్వాతి సినిమాలపై దృష్టి పెట్టారు చిరు. తన తదుపతి చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. ఇదే గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ఓ ఆటం బాంబింగ్ స్వింగింగ్స్ సాంగ్ ఉందట. ఆ పాటకు కొరియోగ్రాఫర్‌గా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా వ్యవహరించనున్నారట. ఈ విషయాన్ని తమన్ స్వయంగా వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
"హే.. ఇది అతిపెద్ద వార్త. చిరు-సల్మాన్ కోసం ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా చేయనున్నారు. ఆటం బాంబింగ్ సాంగ్ అనే ఈ పాటతో థియేటర్లలో ఫైర్ రావడం ఖాయం" అని తమన్ తన పోస్టులో వివరించారు.
త్వరలోనే మేకర్స్ సినిమాలోని ఈ పాటను చిత్రీకరించనున్నారు. చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి నర్తించనున్న ఈ పాట కోసం అభిమానుల ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్క్రీన్‌పై వారికి కన్నుల పండుగలా మారనుంది. ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.
ప్రస్తుతం గాడ్‌ఫాదర్ చిత్ర షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.