Manchu Vishnu : జిన్నా రిలీజ్ డేట్ ను రివీల్ చేసిన మంచు విష్ణు
జిన్నా (Ginna Movie) సినిమా రిలీజ్ డేట్ ను మంచు విష్ణు ( Manchu Vishnu) సోమవారం డిఫరెంట్ గా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే...
manchu vishnu ginna release date: మోసగాళ్లు తర్వాత మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం జిన్నా. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ముగ్గురు స్నేహితుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. జిన్నా సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. సన్నీలియోన్,పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో కరెంట్ తీగ తర్వాత సన్నీలియోన్ నటిస్తున్న సినిమా ఇది. సోమవారం మంచు విష్ణు ట్విట్టర్ లో అక్టోబర్ 5 అంటూ డేట్ తెలియజేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు.
ట్రెండింగ్ వార్తలు
అక్టోబర్ 5న విజయదశమి కావడంతో అదే రోజున జిన్నా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. రిలీజ్ డేట్ ను డిఫరెంట్ గా ఇలా విష్ణు వెల్లడించినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. ఈ పేరును షార్ట్ కట్ చేస్తూ జిన్నా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
జిన్నా షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాతో మంచు విష్ణు కూతుళ్లు అరియానా,వివియానా సింగర్స్ గా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.