payal rajput: జిన్నా క్రైమ్ పార్ట్‌నర్‌గా పాయల్ రాజ్‌పుత్
జిన్నా(Ginna movie) సినిమాతో దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది పాయల్ రాజ్‌పుత్(Payal rajput). ఇందులో మంచు విష్ణు (Manchu Vishnu)హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఫస్ట్‌లుక్ ను సోమవారం రిలీజ్ చేశారు.
జిన్నా సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో మంచు విష్ణు.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్నేహం,ప్రేమ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. జిన్నా సినిమాతో ఇషాన్ సూర్య దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పాయల్ రాజ్‌పుత్,సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్‌పుత్ కనిపించబోతున్నది. ఈ పోస్టర్‌లో లంగాఓణీ ధరించి పల్లెటూరి యువతిగా పాయల్ కనిపిస్తోంది. ‘అల్లరి పనులు చేయడానికి ప్రతి ఒక్కరికి తోడుగా ఓ ఫ్రెండ్ ఉండాలి. జిన్నా పార్టనర్ ఇన్ క్రైమ్స్’ అంటూ తన క్యారెక్టర్ ను ఉద్దేశించి పాయల్ పేర్కొన్నది.
పాయల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విజయదశమి కానుకగా ఆక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ప్రభుదేవా,గణేష్ ఆచార్య,ప్రేమ్ రక్షిత్ మాస్టర్స్ ఈ సినిమాకు డాన్స్ కంపోజ్ చేస్తున్నారు.