తెలుగు న్యూస్  /  Entertainment  /  Sitaramam Telugu Movie Review Dulquer Salmaan Mrunal Thakur Rashmika Mandanna

Sitaramam review: సీతారామం మూవీ రివ్యూ - ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

HT Telugu Desk HT Telugu

05 August 2022, 14:12 IST

  • Sitaramam movie review: దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salmaan), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సీతారామం(Sitaramam). యుద్దం, ప్రేమ అంశాల‌తో ముడిప‌డి తెర‌కెక్కిన ఈసినిమా ఎలా ఉందంటే...

దుల్క‌ర్ స‌ల్మాన్,మృణాళ్ ఠాకూర్
దుల్క‌ర్ స‌ల్మాన్,మృణాళ్ ఠాకూర్ (twitter)

దుల్క‌ర్ స‌ల్మాన్,మృణాళ్ ఠాకూర్

Sitaramam movie review: మాస్, యాక్షన్ సినిమాల‌కంటే ప్రేమ‌క‌థ‌ల‌తోనే ద‌క్షిణాదిలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు దుల్క‌ర్ స‌ల్మాన్‌ (dulquer salmaan). దుల్క‌ర్ సినిమాఅంటే మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన తాజా చిత్రం సీతారామం. అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడివీర‌ప్రేమ‌గాథ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ‌ను చాటుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి(hanu raghavapudi) ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!

Recent OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

HanuMan Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ మూవీ దుమ్మురేపుతుందా?

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ నిర్మించారు. మృణాల్ ఠాకూర్(mrunal thakur) హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న(Rashmika mandanna) కీల‌క పాత్ర పోషించింది. సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌రుకావ‌డం, పాట‌లు, ప్ర‌చార చిత్రాల్లో కొత్త‌ద‌నం క‌నిపించ‌డంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

పొయెటిక్ ల‌వ్‌స్టోరీతో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? ఈ సినిమాతో హ‌ను రాఘ‌వ‌పూడి విజ‌యాన్ని అందుకున్నాడా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

Sitaramam story: లెఫ్టినెంట్ రామ్ ప్రేమాయణం

లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ‌. కశ్మీర్ లో సైనికుడిగా పనిచేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు అతడికి సీతామహాలక్ష్మి (మృణాళ్ ఠాకూర్) అనే అమ్మాయి నుండి ఉత్తరం వస్తుంది. ఆ లెటర్ పై ఫ్రమ్ అడ్రస్ ఉండదు.

ఉత్త‌రాల ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన అనుబంధం ప్రేమ‌కు దారితీస్తుంది. సీత‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న రామ్ కష్టపడి ఆమె ఆచూకీ తెలుసుకుంటాడు.

ఓ ప్యాలెస్‌లో కళాకారిణిగా సీత పనిచేస్తుందని తెలుసుకుంటాడు. సీతకు తన ప్రేమను వ్యక్తం చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటానని అంటాడు. కానీ సీత మాత్రం అతడి ప్రతిపాదనను అంగీకరించదు.

ఓ సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్ వెళ్లిన రామ్ ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో శత్రుసైనికులకు చిక్కుతాడు. సీత కోసం రామ్ ఓ ఉత్తరం రాస్తాడు. ఆ లెటర్‌ను ఇరవై ఏళ్ల త‌ర్వాత సీత‌కు చేర‌వేసే బాధ్య‌త‌ను ఆఫ్రీన్ (రష్మిక మందన్న) తీసుకుంటుంది.

ఆమె అన్వేష‌ణ నెర‌వేరిందా? సీత‌కు ఆ ఉత్త‌రం అందిందా? ఆఫ్రీన్ అన్వేష‌ణ‌లో రామ్‌, సీత గురించి ఏం తెలుసుకున్నది? ఆ ఉత్త‌రాన్ని చేర‌వేసే బాధ్య‌త‌ను ఆఫ్రీన్ చేప‌ట్ట‌డానికి కార‌ణ‌మేమిటి? ఆఫ్రీన్ తో రామ్‌కు ఉన్న సంబంధమేమిటి?

అసలు సీత ఎవరు? రామ్ తో పెళ్లికి ఆమె ఎందుకు నిరాకరించింది? రామ్‌తో పెళ్లికి సీత ఎందుకు అంగీక‌రించ‌లేదు? నిజాయితీపరుడైన రామ్‌పై దేశద్రోహిగా ఎందుకు ముద్రపడింది? అతడి జీవితం చివరకు ఎలా ముగిసింది సీతారామం ఇతివృత్తం.

కాలాల్ని దాటే ప్రేమ sitaramam

దేశభక్తి నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఒక నిజాన్ని కాలాలు దాటి తెలియజేయడానికి ప్రేమ ఎంతదూరమైన వెళుతుందనే పాయింట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఓ ఒంటరి యువకుడి జీవన ప్రయాణం, అనుకోకుండా మొదలైన ప్రేమకథతో పాటు తాను కన్న కలలు ఎలా భగ్నమయ్యాయో భావోద్వేగభరితంగా సీతారామం సినిమాలో దర్శకుడు ఆవిష్కరించారు.

కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో

కశ్మీర్ అల్లర్లు, ఉగ్రవాదుల కుట్రలతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. కశ్మీర్ పండిట్స్‌ను కాపాడటానికి నాయకుడు చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత అనాథ అయిన హీరోకు కథానాయిక ఉత్తరాలు రాసే సీన్‌లో సీతారామం లవ్ స్టోరీగా టర్న్ అవుతుంది.

సీతను వెతుక్కుంటూ రామ్ సాగించే ప్రయాణం పొయెటిక్ ఫీల్ ను కలిగిస్తుంది. ద్వితీయార్థం ఈ సినిమాకు బలంగా నిలిచింది. సీత నేపథ్యాన్ని చూపిస్తూనే రామ్ తో పెళ్లికి ఆమె అంగీకరించలేని పరిస్థితులను హృద్యంగా చూపించారు.

తానెవరో చెప్పకుండా రామ్‌ను ఆటపట్టిస్తూ సీత చేసే అల్లరి మెప్పిస్తుంది. ఆఫ్రీన్‌తో రామ్‌కు ఉన్న సంబంధమేమిటనే ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఆసక్తిని పంచుతుంది.

పాకిస్థాన్ వెళ్లిన రామ్ కు ఎదురైన పరిస్థితులను దర్శకుడు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. ఒక్కో చిక్కుముడిని విప్పికుంటూ ఎంగేజింగ్ గా సినిమాను నడిపించారు.

దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అదుర్స్

రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ జీవించారు. మతం కంటే మానవత్వమే గొప్పదని నమ్మే సైనికుడిగా, ప్రేమికుడిగా చక్కటి ఎమోషన్స్ పండించాడు. సీత ప్రేమ కోసం అతడు పడే తపన, ఆరాటం ఆకట్టుకుంటాయి. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అయ్యింది.

సీత పాత్రలో మృణాల్ అందంతో పాటు అభినయంతో మెప్పించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి. రెండు కాలాలకు మధ్య వారధిగా నిలిచే పాత్రలో రష్మిక(Rashmika Mandanna,) సర్ ప్రైజ్ యాక్టింగ్ కనబరిచింది.

ఆమె పాత్ర దృక్కోణం నుండి ఈ కథ నడుస్తుంది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో సుమంత్ నటించాడు. తరుణ్ భాస్కర్, మురళీశర్మ తమ నటనతో మెప్పించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణంపోశాయి.

ఉత్తరం చదువుతున్న ఫీలింగ్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సీతారామం ఆకట్టుకుంటుంది. అందమైన ఉత్తరాన్ని చదువుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

రేటింగ్: 3/ 5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.