తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sir Movie Collections: అప్పుడే లాభాల్లోకి దూసుకెళ్లిన ధనుష్ సార్ మూవీ

Sir Movie Collections: అప్పుడే లాభాల్లోకి దూసుకెళ్లిన ధనుష్ సార్ మూవీ

Hari Prasad S HT Telugu

20 February 2023, 14:59 IST

    • Sir Movie Collections: అప్పుడే లాభాల్లోకి దూసుకెళ్లింది ధనుష్ సార్ మూవీ. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తొలి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
సార్ మూవీలో ధనుష్, సంయుక్త
సార్ మూవీలో ధనుష్, సంయుక్త

సార్ మూవీలో ధనుష్, సంయుక్త

Sir Movie Collections: తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన తొలి తెలుగు డైరెక్ట్ మూవీ సార్. తమిళంలోనూ వాతి పేరుతో రిలీజైంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే సాధిస్తోంది. మంచి సందేశాత్మక కథతోపాటు ధనుష్ తనదైన స్టైల్లో నటించడం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Hansika Guardian Review: గార్డియన్ రివ్యూ - హ‌న్సిక లేటెస్ట్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

గత శుక్రవారం (ఫిబ్రవరి 17) రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తొలి వీకెండ్ లోనే మంచి వసూళ్లు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.16.54 కోట్లు వసూలు చేయడం విశేషం. తెలుగులో ఇప్పటి వరకూ రిలీజైన ధనుష్ మూవీస్ అన్నింటిలోకీ ఈ సార్ మూవీ కలెక్షన్లే అత్యధికం. తొలి రోజే రికార్డు ఓపెనింగ్ అందుకున్న ధనుష్.. మూడు రోజులూ అదే కొనసాగించాడు.

ఇప్పటికే సార్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్లింది. మలయాళ బ్యూటీ సంయుక్త ఈ సార్ మూవీలో ఫిమేల్ లీడ్ గా కనిపించింది. వీళ్లే కాకుండా సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆదిలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.

సార్ మూవీ గురించి..

విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోతుపాతుల‌ను ఆవిష్క‌రిస్తూ రూపొందిన సినిమా ఇది. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన విద్యా నేడు ఎలా వ్యాపారంగా మారిపోయింది? అధిక ఫీజుల కార‌ణంగా దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లు చ‌దువుకు ఏ విధంగా దూర‌మ‌వుతోన్నార‌నే పాయింట్‌తో సార్ సినిమాను తెర‌కెక్కించారు వెంకీ అట్లూరి. సింపుల్ క‌థ‌కు ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా సుగ‌ర్ కోటెడ్‌లా సోష‌ల్ మెసేజ్‌ను జోడించి ప్రేక్ష‌కుల్ని మెప్పించేప్ర‌య‌త్నం చేశారు.

బాల గంగాధ‌ర్ తిల‌క్ అనే లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో ధ‌నుష్ జీవించాడు. తాను ఎంత నాచుర‌ల్ యాక్ట‌రో ఈ పాత్ర మ‌రోసారి చాటిచెబుతుంది. కామెడీ, యాక్ష‌న్‌, సెంటిమెంట్ ఇలా అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. సంయుక్త పాత్ర రొటీన్‌గా ఉంది. స‌ముద్ర‌ఖ‌ని విల‌నిజంలో కొత్త‌ద‌నం లేదు. హైప‌ర్ ఆది కామెడీ కొన్ని చోట్ల ప‌ర్వాలేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.