తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sir Movie Collection Day 1: సార్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ధ‌నుష్ తెలుగు రిలీజ్‌ల‌లో ఇదే హ‌య్యెస్ట్‌

Sir Movie Collection Day 1: సార్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ధ‌నుష్ తెలుగు రిలీజ్‌ల‌లో ఇదే హ‌య్యెస్ట్‌

18 February 2023, 12:19 IST

  • Sir Movie Collection Day 1: సార్ సినిమా తెలుగులో ధ‌నుష్ కెరీర్‌లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. శుక్ర‌వారం ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

ధ‌నుష్
ధ‌నుష్

ధ‌నుష్

Sir Movie Collection Day 1: ధ‌నుష్ హీరోగా న‌టించిన సార్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అధిక ఫీజుల‌తో దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను చ‌దువుకు దూరం చేస్తోన్న విద్యా వ్య‌వ‌స్థ‌పై ఓ సాధార‌ణ లెక్చ‌ర‌ర్ సాగించే పోరాటంతో ఈ సినిమా తెర‌కెక్కింది. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

తెలుగులో సార్‌ సినిమా తొలిరోజు దాదాపు నాలుగున్నర కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో ధ‌నుష్ కెరీర్‌లో తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా సార్ నిలిచింది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు కోటి ప‌ది ల‌క్ష‌ల‌కుపైగా వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఉత్త‌రాంధ్ర‌లో 33 ల‌క్ష‌లు, సీడెడ్‌లో 31 ల‌క్ష‌ల వ‌ర‌కు తెలుగు వెర్ష‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది.

ఓవ‌రాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నాలుగున్న‌ర కోట్ల గ్రాస్‌ను రెండు కోట్లముప్పై ల‌క్ష‌లకుపైగా షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. రీసెంట్ టైమ్‌లో రిలీజైన డ‌బ్బింగ్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా సార్ నిలిచింది. ఈ సినిమా త‌మిళంలో వాతి పేరుతో శుక్ర‌వారం రిలీజైంది.

త‌మిళ వెర్ష‌న్ తొలిరోజు 7.5 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అనే లెక్చ‌ర‌ర్‌గా ధ‌నుష్ యాక్టింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సంయుక్త హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.