తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush Vs Selvaraghavan: ధ‌నుష్ వ‌ర్సెస్ సెల్వ రాఘ‌వ‌న్ - అన్న‌ద‌మ్ముల బాక్సాఫీస్ ఫైట్‌

Dhanush vs Selvaraghavan: ధ‌నుష్ వ‌ర్సెస్ సెల్వ రాఘ‌వ‌న్ - అన్న‌ద‌మ్ముల బాక్సాఫీస్ ఫైట్‌

14 February 2023, 11:33 IST

  • Dhanush vs Selvaraghavan: కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ అన్న‌య్య సెల్వ‌రాఘ‌వ‌న్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధ‌మ‌య్యాడు. ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు న‌టించిన వేర్వేరు సినిమాలు ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

ధ‌నుష్‌, సెల్వ రాఘ‌వ‌న్‌
ధ‌నుష్‌, సెల్వ రాఘ‌వ‌న్‌

ధ‌నుష్‌, సెల్వ రాఘ‌వ‌న్‌

Dhanush vs Selvaraghavan: అన్న‌ద‌మ్ములు న‌టించిన వేర్వేరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం అరుదుగా జ‌రుగుతుంది. ఈ రేర్ ఫీట్‌కు ఫిబ్ర‌వ‌రి 17న కోలీవుడ్‌లో వేదిక‌గా మార‌బోతున్న‌ది. త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన వాతితో పాటు సెల్వ రాఘ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ బ‌కాసుర‌న్ సినిమాలు ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

డైరెక్ట‌ర్‌గా త‌మిళంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్ని తెర‌కెక్కించిన సెల్వ‌రాఘ‌వ‌న్‌....విజ‌య్ హీరోగా న‌టించిన బీస్ట్ సినిమాతో న‌టుడిగా మారాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన బ‌కాసుర‌న్ సినిమాలో సెల్వ రాఘ‌వ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మ‌రోవైపు ధ‌నుష్ వాతి సినిమాకు టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌పై పోరాడే ఓ లెక్చ‌ర‌ర్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు సెల్వ‌రాఘ‌వ‌న్ బ‌కాసుర‌న్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. కోలీవుడ్‌లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు న‌టించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్ హీరోగా పేరుతెచ్చుకున్న త‌మ్ముడు ధ‌నుష్‌తో అన్న‌య్య సెల్వ‌రాఘ‌వ‌న్ పోటీప‌డ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌మ్ముడు ధ‌నుష్ అగ్ర హీరోగా ఎద‌గ‌డంలో అన్న‌య్య సెల్వ‌రాఘ‌వ‌న్ పాత్ర ఎంతో ఉంది.

సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తుళ్లువ‌దో ఇల‌మై సినిమాతో ధ‌నుష్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ అన్న‌ద‌మ్ముల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కాద‌ల్ కొండెన్‌, పుదు పెట్టై, మ‌యాక్కం ఎన్న‌తో పాటు ప‌లు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్‌గా నిలిచాయి. గ‌త ఏడాది సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాను వ‌రువెన్ అనే సినిమా చేశాడు ధ‌నుష్‌.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం