తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaru Vaari Paata Collections | సర్కారు వారి పాట కలెక్షన్ల రికార్డు

Sarkaru Vaari Paata Collections | సర్కారు వారి పాట కలెక్షన్ల రికార్డు

HT Telugu Desk HT Telugu

17 May 2022, 17:55 IST

    • సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీకి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తూనే ఉంది.
కీర్తిసురేష్, మహేష్ బాబు
కీర్తిసురేష్, మహేష్ బాబు (twitter)

కీర్తిసురేష్, మహేష్ బాబు

మహేష్‌ బాబు చాలా రోజుల తర్వాత నటించిన సినిమా సర్కారు వారి పాట. దీంతో ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజైన రోజు మాత్రం ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్‌ వచ్చింది. ఫ్యాన్స్‌ను వదిలేస్తే న్యూట్రల్‌ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. అందుకు తగినట్లే ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు కూడా తగ్గాయి.

ట్రెండింగ్ వార్తలు

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

అయితే ఫస్ట్‌ వీకెండ్‌లో ఈ మూవీ పుంజుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల షేర్‌ను అందుకుంది. అంతేకాదు కేవలం తెలుగు వెర్షన్‌ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్‌ను అత్యంత వేగంగా అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్‌ కూడా మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. పరశురాం డైరెక్షన్‌లో వచ్చిన ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ దగ్గర రూ.160 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ.. రెండోరోజు కాస్త తగ్గి.. శనివారం నుంచి మళ్లీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి దేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.