తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu | మహేష్‌ బాబు బాలీవుడ్ కామెంట్స్‌పై రాంగోపాల్‌ వర్మ రియాక్షన్‌ ఇదీ

Mahesh Babu | మహేష్‌ బాబు బాలీవుడ్ కామెంట్స్‌పై రాంగోపాల్‌ వర్మ రియాక్షన్‌ ఇదీ

HT Telugu Desk HT Telugu

12 May 2022, 6:14 IST

    • బాలీవుడ్‌ నన్ను భరించలేదు అంటూ ఈ మధ్య మహేష్‌ బాబు చేసిన కామెంట్స్‌ పెద్ద దుమారమే రేపాయి. దీనిపై ఆ ఇండస్ట్రీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. మహేష్‌ మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చర్చకు దారి తీస్తున్న బాలీవుడ్ పై మహేష్ బాబు వ్యాఖ్యలు
చర్చకు దారి తీస్తున్న బాలీవుడ్ పై మహేష్ బాబు వ్యాఖ్యలు

చర్చకు దారి తీస్తున్న బాలీవుడ్ పై మహేష్ బాబు వ్యాఖ్యలు

ఈ మధ్య మేజర్‌ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు మహేష్‌ బాబు బాలీవుడ్‌ అవకాశాలపై స్పందించిన విషయం తెలుసు కదా. ఆ ఇండస్ట్రీ తనను భరించలేదని, అక్కడ సినిమాలు చేయడం టైమ్‌ వేస్ట్‌ అని అతడు కామెంట్‌ చేశాడు. తమ ఇండస్ట్రీని ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఏంటని కొందరు బాలీవుడ్‌ పెద్దలు ఈ సూపర్‌స్టార్‌పై మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే మహేష్‌ వివరణ కూడా ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

అయితే తాజాగా టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ను కూడా ఏలిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా మహేష్ కామెంట్స్‌పై స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. అసలు మహేష్‌ కామెంట్స్‌ వెనుక ఉద్దేశమేంటో అర్థం కాలేదని అన్నాడు. "ఓ నటుడిగా అది అతని ఛాయిస్‌. అయితే బాలీవుడ్ నన్ను భరించలేదు అని అనడంలో అతని ఉద్దేశమేంటో నాకు అర్థం కాలేదు" అని ఆర్జీవీ అన్నాడు.

"ఇప్పటికీ అతని కామెంట్స్‌ వెనుక ఉద్దేశమేంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే సౌత్‌ ఇండియన్‌ సినిమాలను తీసుకుంటే వాళ్లు తమ మూవీస్‌ను హిందీలో డబ్‌ చేసి ఎంతోకొంత డబ్బు వెనకేసుకున్నారు. పైగా బాలీవుడ్‌ అనేది ఓ కంపెనీ కాదు. దానికి మీడియా ఆ పేరు పెట్టింది. ఓ మూవీ కంపెనీ లేదంటే ప్రొడక్షన్‌ హౌజ్‌ ఓ సినిమా చేస్తే ఇంత డబ్బు ఇస్తామని చెబుతుంది. అలాంటప్పుడు అతడు బాలీవుడ్‌నే ఎందుకు అన్నాడు. నాకు అది అర్థం కాలేదు. బాలీవుడ్‌ ఓ కంపెనీ కాదు. అందుకే అతని ఉద్దేశమేంటో అర్థం కాలేదు" అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.

నిజానికి తన కామెంట్స్‌ వెనుక ఏ ఇతర భాషలను తక్కువ చేసే ఉద్దేశం లేదంటూ మహేష్‌ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు. తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ఇష్టమని, దానిని వదిలి వెళ్లను అన్న ఉద్దేశంలోనే తాను అలా మాట్లాడానని, బాలీవుడ్‌ను తక్కువ చేయలేదని ఆ ప్రకటనలో మహేష్‌ చెప్పడం విశేషం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం