తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Fan Favorite Movie 2022: అభిమానులు మెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్.. అవతార్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిన మూవీ

RRR Fan Favorite Movie 2022: అభిమానులు మెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్.. అవతార్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిన మూవీ

31 January 2023, 12:30 IST

    • RRR Fan Favorite Movie 2022: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలే కాకుండా అభిమానుల మెచ్చిన చిత్రంగా ఘనత సాధించింది. అవతార్, టాప్ గన్ లాటి చిత్రాలను వెనక్కి నెట్టింది.
అభిమానులు మెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్
అభిమానులు మెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్

అభిమానులు మెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్

RRR Fan Favorite Movie 2022: ఎన్ని అవార్డులున్నా, ఎన్ని గౌరవాలు అందుకున్నా.. ప్రేక్షకులకు నచ్చడం కంటే మరో గౌరవం లేదని చెప్పాలి. ఆస్కార్లు, గోల్డెన్ గ్లోబ్‌లు కూడా దానిముందు దిగదుడుపే. ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం ఆస్కార్ అవార్డుల్లో మల్టిపుల్ అవార్డులకు నామినేట్ అవుతుందని ఆశిస్తే.. ఎప్పటిలాగానే హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఆర్ఆర్ఆర్‌ను కేవలం నాటు నాటు సాంగ్‌ను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మినహా మిగిలిన ఏ కేటగిరిలోనూ నామినేషన్‌కు కూడా ఎంపిక కానీయలేదు. మిగిలిన భారతీయ చిత్రాలకైతే ఆ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే గతేడాది అత్యధిక మంది మెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. అభిమానుల ఎక్కువగా నచ్చిన సినిమాలో జాబితాలో అవతార్ 2, టాప్ గన్ మ్యావ్రిక్ లాంటి సినిమాలను తోసిరాజని ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

ప్రముఖ మూవీ రివ్యూ పోర్టల్ రొటెన్ టొమాటోస్ ప్రకటించిన ఫ్యాన్ ఫెవరెట్ మూవీస్ 2022 విభాగంలో ఆర్ఆర్ఆర్ గోల్డెన్ టొమాటో అవార్డును కైవసం చేసుకుంది. అభిమానులు అత్యధికంగా నచ్చిన చిత్రాల్లో టాప్-5 స్థానంలో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. టాప్ గన్ మ్యావ్రిక్, ఎవ్రీథింక్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్, అవతార్ ది వే ఆఫ్ వాటర్, టాప్ గన్ మ్యావ్రిక్, ది బ్యాట్ మ్యాన్ లాంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఈ సినిమా టాప్‌లో నిలిచింది.

ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించింది. ఇది కాకుండా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కూడా రెండు విభాగాల్లో సాధించింది. అంతేకాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ను కూడా దక్కించుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.