తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Og Update: పవర్‌స్టార్ ఓజీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ అలా..!

Pawan Kalyan OG Update: పవర్‌స్టార్ ఓజీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ అలా..!

31 January 2023, 11:41 IST

    • Pawan Kalyan OG Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాన్ని సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓజీ అనే ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది.
పవన్ కల్యాణ్-సుజీత్ మూవీ
పవన్ కల్యాణ్-సుజీత్ మూవీ

పవన్ కల్యాణ్-సుజీత్ మూవీ

Pawan Kalyan OG Update: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan).. సాహో దర్శకుడు సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓజీ- ఒరిజినల్ గ్యాంగస్టర్(OG-Original Gangstar) పేరుతో ఈ సినిమాను సోమవారం నాడు ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. ఇందులో పవన్ పాత్ర ఏంటి? ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? అనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారట. రెండు భాగాలుగా రూపొందించి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదటి భాగాన్ని 2023 దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలని అనుకుంటున్నారట. దసరా పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సుజీత్ చెప్పిన పవన్‌కు విపరీతంగా నచ్చిందని, ముఖ్యంగా మొదటి భాగంలోని క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నట్లు టాక్. రెండో భాగం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసేలా ఈ క్లైమాక్స్ ఉంటుందని సమాచారం. ఈ భారీ బడ్జెట్ గ్యాంగ్‌స్టర్ మూవీ పవర్‌స్టార్ స్టామినాను మరింత పెంచేలా ఉంటుందని వినికిడి.

సాహో మూవీ పరాజయం తర్వాత సుజీత్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నాడు. దీంతో పవన్ సినిమా తనకు వచ్చిన సువర్ణావకశాంగా భావించి స్క్రిప్టుపై బాగా వర్కౌట్ చేశాడని ఫిల్మ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఓజీ రెండు సినిమా భాగాలుగా రాబోతుండటంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పవర్ స్టార్ కెరీర్‌లోనే తొలిసారిగా రెండు భాగాలు కలిగిన సినిమాలో నటిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం