Pawan Kalyan Sujeeth Movie : పవన్ కల్యాణ్-సుజీత్ సినిమా క్రేజీ అప్డేట్-pawan kalyan director sujeeth movie opening muhurthan fix here s details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Sujeeth Movie : పవన్ కల్యాణ్-సుజీత్ సినిమా క్రేజీ అప్డేట్

Pawan Kalyan Sujeeth Movie : పవన్ కల్యాణ్-సుజీత్ సినిమా క్రేజీ అప్డేట్

Anand Sai HT Telugu
Jan 28, 2023 10:22 AM IST

Pawan Kalyan Sujeeth Movie : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రానికి సంబంధించి.. తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

పవన్-సుజీత్ సినిమా
పవన్-సుజీత్ సినిమా

టాలీవుడ్‌లో కొత్త కాంబినేష‌న్ రానుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) హీరోగా సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆర్ఆర్ఆర్(RRR) నిర్మాత డీవీవీ దాన‌య్య ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు(Hari Hari Veeramallu) సినిమా షూటింగ్ నడుస్తోంది. మరోవైపు హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేయాల్సి ఉంది. సుజీత్ తో సినిమా ఉండగా, సముద్రఖనితో ఓ రీమేక్ కూడా ప్లాన్ చేశాడు పవర్ స్టార్. హరీశ్ శంకర్(Harish Shankar) సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్ జరగగా.. రెగ్యూలర్ షూటింగ్ కి ఇంకా సమయం పట్టనుంది. హరిహరవీరమల్లు సినిమా మాత్రం షూటింగ్ నడుస్తోంది.

మరోవైపు కొత్త సినిమా సైతం.. పవన్ ఒప్పుకొన్నాడు. సుజీత్ దర్శకత్వంలో ఇప్పటికే సినిమాను ప్రకటించారు. డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ కథతో సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాను కూడా ప్రారంభించనున్నారు. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. జనవరి 30న ఈ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించేందుకు నిర్ణయించారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి.. రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది. మరోవైపు హరిహరవీరమల్లు చిత్రం షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. దీనికి ఇంకా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. హరీశ్ సినిమా పూర్తై.. సుజీత్ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

సముద్రఖని దర్శకత్వంలో వినోదయసీతం సినిమా రీమేక్‌ చేయాల్సి ఉంది పవన్. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలిక. మొదట ఈ సినిమానే పట్టాలెక్కుతుందని చెప్పుకొచ్చారు. కానీ పవన్‌ కల్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలియాలి. ఇప్పుడు నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది.

సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా ప్రకటన రావడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల దృష్టి దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) వైపు పడింది. ఎందుకంటే... తన అభిమాన కథానాయకుడు పవర్ స్టార్‌తో 'గబ్బర్ సింగ్' వంటి హిట్ సినిమా తీసిన ట్రాక్ రికార్డు అతనిది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆ సినిమా ప్రకటన వచ్చిన కూడా చాలా రోజులు అయ్యింది. కానీ, ఇంత వరకు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? అనే క్లారిటీ లేదు.

IPL_Entry_Point