Pawan Kalyan Sujeeth Movie Opening: గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ - సుజీత్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ - ఫొటోలు వైర‌ల్-pawan kalyan sujeeth they call him og movie begins with pooja ceremony in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Sujeeth Movie Opening: గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ - సుజీత్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ - ఫొటోలు వైర‌ల్

Pawan Kalyan Sujeeth Movie Opening: గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ - సుజీత్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ - ఫొటోలు వైర‌ల్

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2023 12:30 PM IST

Pawan Kalyan Sujeeth Movie Opening: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు సుజిత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నాడు. అత‌డి ఫొటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan Sujeeth Movie Opening: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడు సుజీత్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న తాజా సినిమా సోమ‌వారం గ్రాండ్‌గా మొద‌లైంది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో భారీగా ఈ సినిమా ఓపెనింగ్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ లాంఛింగ్ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌య్యాడు.

ప‌వ‌న్ వేడుక‌కు వ‌చ్చిన వీడియోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. బ్లాక్ హుడీ, జీన్స్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వీడియోలో క‌నిపిస్తున్నారు. వీడియోతో పాటు ఈ ఈవెంట్‌లో ప‌వ‌న్ పాల్గొన్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

దే కాల్ హిట్ ఓజీ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. క్లాప్‌బోర్డ్ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు సుజీత్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. సాహో త‌ర్వాత సుజీత్ తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. మ‌రోవైపు పాలిటిక్స్‌కు ప్రాధాన్య‌మిస్తూనే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తోన్నాడు. మొఘ‌లుల కాలం నాటి క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బందిపోటు దొంగ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అలాగే గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా చేయ‌బోతున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన తెరి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్‌పైకి రానుంది. వీటితో పాటుగా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సినిమా చేయ‌బోతున్నారు.

IPL_Entry_Point