RRR 100 Days In Japan : జపాన్​లో జక్కన్న రికార్డు.. 'ఆర్ఆర్ఆర్' 100 రోజులు-rrr movie completes 100 days in japan ss rajamouli tweet goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr 100 Days In Japan : జపాన్​లో జక్కన్న రికార్డు.. 'ఆర్ఆర్ఆర్' 100 రోజులు

RRR 100 Days In Japan : జపాన్​లో జక్కన్న రికార్డు.. 'ఆర్ఆర్ఆర్' 100 రోజులు

Anand Sai HT Telugu
Jan 28, 2023 11:14 AM IST

RRR Movie 100 Days : ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఎక్కడికి వెళ్లినా.. రికార్డులు బద్దలు కొడుతోంది.. అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటోంది. తాజాగా మరోగా రికార్డు నమోదు చేసింది ఆర్ఆర్ఆర్.

జపాన్​లో ఆర్ఆర్ఆర్ 100 రోజులు
జపాన్​లో ఆర్ఆర్ఆర్ 100 రోజులు (twitter)

దర్శకుడు జక్కన చెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్(RRR).. అంతర్జాతీయ వేదికల మీద దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. మరోవైపు ఆ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలోనూ నిలిచింది. తాజాగా మరో రికార్డు సృష్టించింది ఆర్ఆర్ఆర్. జపాన్ లో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ట్వీట్ చేశాడు. జపాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు.

'ఆ రోజుల్లో సినిమా 100 రోజులు, 175 రోజులు నడుస్తుండేవి అది చాలా పెద్ద విషయం. కాలక్రమేణా స్వరూపం మారిపోయింది.. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి.. కానీ జపనీస్ అభిమానులు మాకు ఆనందాన్ని కలిగించారు.' అంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్(Rajamouli Tweet) చేశాడు.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Cinema) 2022 అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైంది. రాజమౌళి, ఎన్టీఆర్, రామచరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపారు. జపాన్ లోని ప్రేక్షుకులను కలిసి.. వారితో ముచ్చటించారు. అదే రేంజ్ లో జపనీస్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు జపాన్ లో భారీ ఎత్తున ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. జపాన్ లో విడుదలైన భారతీయ చిత్రాలన్నింటికంటే.. ఆర్ఆర్ఆర్ ఎక్కువ ఓపెనింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది.

నివేదికల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో మెుదటి రోజు సుమారు రూ.1.06 కోట్లు రాబట్టింది. అయితే గతంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఒక్కరోజే రూ. 90 లక్షలతో రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డును ఆర్ఆర్ఆర్(RRR) బ్రేక్ చేసింది. కొన్నిరోజులపాటు జపాన్ లోనే తారక్, చరణ్ అభిమానులు కలుసుకున్నారు. ఆ ఫొటోలు గతంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ వంద రోజులు పూర్తి చేసుకుంది. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. రూ.1000 కోట్ల వరకూ రాబట్టిందీ సినిమా.

మరోవైపు ఆస్కార్ అవార్డు 2023 కోసం ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పలు చిత్రాలు నామినేట్ అయ్యాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటు కూడా నామినేట్ అయింది. నాటు నాటు సాంగ్(Naatu Naatu Song) కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, ఇతర భాషలతోపాటుగా విదేశాల్లోనూ సత్తాచాటింది. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందరినీ ఈ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన సాహిత్యానికి.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫి చేశారు.

నాటు నాటు పాటకు ఇప్పటికే పలు అంతర్జాతీ అవార్డులు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

IPL_Entry_Point