తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr Lyricist Chandrabose Reaction After Naatu Naatu Earning Oscar 2023 Nomination

Chandrabose Reaction on Oscar: ఈ విజయాన్ని తలకు ఎక్కించుకోను.. ఆస్కార్ నామినేషన్‌పై చంద్రబోస్ స్పందన

25 January 2023, 13:41 IST

    • Chandrabose Reaction on Oscar: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడంపై ఆ సాంగ్ రాసిన చంద్రబోస్ స్పందించారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని, తనకు ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళి, కీరవాణికి ధన్యవాదాలు చెప్పారు.
చంద్రబోస్
చంద్రబోస్

చంద్రబోస్

Chandrabose Reaction on Oscar: ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకుంది. పాట స్వరకర్త ఎంఎం కీరవాణి, రాసిన చంద్రబోస్‌ ఇద్దరూ ఆస్కార్ నామినేట్ అయినట్లు మంగళవారం సాయంత్రం అకాడమీ బృందం ప్రకటించింది. దీంతో ఈ గీత రచయిత చంద్రబోస్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ నామినేషన్ దక్కడంపై స్పందించిన ఆయన ఈ విజయాన్ని తలపై ఎక్కించుకోనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Jathi Ratnalu 2: జాతి రత్నాలు 2 అప్పుడే! అప్డేట్ ఇచ్చిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

City Hunter Review: సిటీ హంటర్ రివ్యూ.. ఓటీటీ లైవ్ యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

"నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని నేను తలపైకి ఎక్కించుకోను. ఆస్కార్ జాబితాలో ఆర్ఆర్ఆర్‌ను చూడటం ఎంతో గర్వంగా ఉంది. ఇంత ఎత్తుకు ఎదుకుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. కీరవాణి, రాజమౌళికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను." అని చంద్రబోస్ అన్నారు.

తెలుగు పాటలు, భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పాట పూర్తిగా సమష్టి కృషితోనే ఇంత పెద్ద విజయాన్ని అందుకుందని స్పష్టం చేశారు. మార్చిలో జరగబోయే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం తను ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

"చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన సామాన్య నేపథ్యం ఉన్న నాలాంటి రచయితలకు ఇది గొప్ప విజయం. ఇక నాటు నాటు రాయడానికి చాలా సమయమే పట్టింది. పాటలో రాసిన ప్రతి పదమూ.. నా బాల్యం, నా గ్రామం, నా కుటుంబానికి సంబంధించిందే. నా మనసులోని భావాలకు, జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చాను" అని చంద్రబోస్ అన్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంపికైంది. హాలీవుడ్‌లో బాగా పాపులరైన పాటల సరసన ఈ సాంగ్ నిలిచింది. ఇంత వరకు ఏ భారతీయ పాట, ముఖ్యంగా తెలుగు సాంగ్ ఇంత వరకు ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లలేదు. తాజా ఘనతతో ఎంఎం కీరవాణి, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.