తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh Saindhav Movie: హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో వెంకీ మామ.. 'సైంధవ్‌'గా లుక్ అదిరిందిగా..!

Venkatesh Saindhav Movie: హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో వెంకీ మామ.. 'సైంధవ్‌'గా లుక్ అదిరిందిగా..!

25 January 2023, 13:08 IST

    • Venkatesh Saindhav Movie: విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని హిట్ 2 డైరెక్టర్ సైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది.
వెంకటేష్
వెంకటేష్

వెంకటేష్

Venkatesh Saindhav Movie: టాలీవుడ్ స్టార్ వెంకటేష్(Venkatesh) గతేడాది ఎఫ్3 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన నటించబోయే సినిమా గురించి ఆసక్తి నెలకొంది. అయితే ఇంతవరకు వెంకీ మామ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇటీవలే హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

OTT Telugu Latest Releases: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసిన రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత

OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

హిట్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమాకు సైంధవ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. చేతిలో గన్ పట్టుకుని మాస్ లుక్‌, గుబురు గడ్డంతో వెంకటేష్ అదరగొట్టారు. ఇంతవరకు వెంకీని చూడని పాత్రలో చూడబోతున్నట్లు ఈ పోస్టర్‌ను చూస్తుంటేనే తెలుస్తోంది. వెంకీ లుక్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ గ్లింప్స్ వీడియోలో విక్టరీ వెంకటేష్ కంటైనర్లు ఉన్న ఓ ప్రదేశంలో చేతిలో ఓ బయో డ్రగ్‌ను పట్టుకుని కనిపించారు. అనంతరం దీంతో దాడి చేసేందుకు కంటైనర్‌లోని గన్‌ను వెతికి తీసుకొచ్చారు. "నేను ఇక్కడ ఉంటాను రా.. ఎక్కడికి వెళ్లను రమ్మను" అనే డైలాగ్‌తో అదరగొట్టారు.

నిహారిక ఎంటర్టైన్ మెంట్(Niharika Entertainment)పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వెంకటేష్ నటించబోయే 75వ సినిమా కావడం గమనార్హం. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాకు సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది రానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం