తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

11 May 2024, 15:31 IST

google News
    • Geethanjali Malli Vachindi OTT Streaming: గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా మరో ఓటీటీలోనూ అడుగుపెట్టింది. దీంతో ఈ హారర్ కామెడీ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఏ ఓటీటీల్లో ఉందంటే..
OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే
OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

Geethanjali Malli Vachindi OTT Platforms: సీనియర్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా రెండో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదలై అనుకున్న స్థాయిలో ఈ మూవీకి కలెక్షన్లు దక్కించుకోలేదు. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో నెలలోపే ఆహా ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

రెండో ఓటీటీలో..

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు అందుబాటులోకి వచ్చింది. ముందస్తు ప్రకటన లేకుండా ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో సడెన్‍గా స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది.

మే 8వ తేదీన సాయంత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇంతలోనే మళ్లీ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ అడుగుపెట్టేసింది. దీంతో ఈ హారర్ కామెడీ చిత్రం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని మొదట్లో సమాచారం వెల్లడైంది. ముందుగా ఆ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమింగ్‍కు వస్తుందని అనుకున్నారు. అయితే, అంతలోనే ఈ మూవీ హక్కులను ఆహా కూడా తీసుకుంది. మే 8వ తేదీనే ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ ఈ చిత్రం అడుగుపెట్టింది.

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ గురించి..

2014లో వచ్చిన హారర్ కామెడీ మూవీ గీతాంజలి సూపర్ హిట్ అయింది. ఆ చిత్రానికి సీక్వెల్‍గా పదేళ్ల తర్వాత ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ రూపొందింది. శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ చిత్రం బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ ముందు బజ్ క్రియేట్ అయినా మిక్స్డ్ టాక్ రావడం చిత్రానికి మైనస్ అయింది. మొత్తంగా కలెక్షన్ల పరంగా ఈ మూవీకి నిరాశే ఎదురైంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంలో అంజలి ప్రధాన పాత్ర పోషించగా.. శ్రీనివాసరెడ్డి, రవిశంకర్, సత్య, షకలక శంకర్, సత్యం రాజేశ్, సునీల్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి కోన వెంకట్, భాను భోగవరపు కథ, స్క్రీన్‍ప్లే అందించారు. ఈ మూవీని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంలో అంజలి యాక్టింగ్, కాస్త కామెడీ మెప్పించినా.. కథ పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. కథలో కొత్తదనం లేదని, రొటీన్‍గా ఉందనే కామెంట్లు వచ్చాయి. ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శీను (శ్రీనివాస రెడ్డి).. అయాన్ (సత్య) హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించాలని అనుకుంటాడు. కానీ అడ్డంకులు వస్తాయి. ఆ చిత్రాన్ని తాను నిర్మిస్తానని.. అయితే సంగీత్ మహల్‍లోనే షూటింగ్ చేయాలని రూల్ పెడతాడు విష్ణు (రాహుల్ మాధవ్). హీరోయిన్‍గా అంజలి (అంజలి)ని ఎంపిక చేస్తారు. షూటింగ్‍కు సంగీత్ మహల్‍కు వెళ్లిన శీను, అంజలి, అయాన్ సహా మూవీ టీమ్‍కు దెయ్యాలు కనిపిస్తాయి. సంగీత్ మహల్ రహస్యమేంటి.. అంజలికి ఏ సంబంధం ఉంది.. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ కథలో ఉంటుంది.

తదుపరి వ్యాసం