Oscar Nominations 2023: బెస్ట్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ షార్ట్ లిస్ట్ కానుందా - స‌స్పెన్స్ వీడేది ఎప్పుడంటే-rrr for oscars best picture and best actor director nominations shortlist will announce on tuesday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr For Oscars Best Picture And Best Actor Director Nominations Shortlist Will Announce On Tuesday

Oscar Nominations 2023: బెస్ట్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ షార్ట్ లిస్ట్ కానుందా - స‌స్పెన్స్ వీడేది ఎప్పుడంటే

Nelki Naresh Kumar HT Telugu
Jan 23, 2023 06:50 PM IST

Oscar Nominations 2023: ఆస్కార్ అవార్డులకు సంబంధించి బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌తో పాటు బెస్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన షార్ట్ లిస్ట్ జాబితాను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్ కు ఏ విభాగాల్లో చోటు ద‌క్కుతుంద‌న్న‌ది సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌

Oscar Nominations 2023: ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ కేట‌గిరీలో ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ కానున్న‌ సినిమా ఏద‌న్న‌ది మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ యాక్ట‌ర్, బెస్ట్ డైరెక్ట‌ర్‌ కేట‌గిరీల్లో ఆర్ఆర్ఆర్ షార్ట్ లిస్ట్ కావ‌డం ఖాయ‌మంటూ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయిన ఈ సినిమా మ‌రికొన్ని విభాగాల్లో చోటు ద‌క్కించుకోనున్న‌ట్లు హాలీవుడ్ వ‌ర్గాలు జోస్యం చెబుతున్నాయి. వాటికి స‌మాధానం మంగ‌ళ‌వారం దొర‌క‌నుంది. బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌తో పాటు మ‌రికొన్ని జాబితాల నామినేష‌న్స్ వివ‌రాల్ని మంగ‌ళ‌వారం అనౌన్స్ చేయ‌బోతున్నారు.

కాలిఫోర్నియాలోని బ్లేవ‌రిహిల్స్ వేదిక‌గా ఈ ఆస్కార్ షార్ట్ లిస్ట్ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌లో రిజ్ అహ్మ‌ద్‌, అలిస‌న్ విలియ‌మ్స్ షార్ట్ లిస్ట్ కానున్న సినిమాల లిస్ట్‌ల‌ను ప్ర‌క‌టించ‌బోతున్నారు.

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌లో ఎవ‌రు?

బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, బెస్ట్ డైరెక్ట‌ర్ కేట‌గిరీలో రాజ‌మౌళి పేర్లు షార్ట్ లిస్ట్ అవుతాయా లేదా అన్న‌ది సినీ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆర్ఆర్ఆర్ స‌హా ఇండియా నుంచి కాంతార‌, ది కాశ్మీర్ ఫైల్స్‌, విక్రాంత్ రోణ‌, గంగూబాయి ఖ‌తియావాడీ, ఇరైవిన్ నిజాల్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌ను ఆయా నిర్మాణ సంస్థ‌లు ఆస్కార్ అవార్డుల కోసం ఇండివిజువ‌ల్ అప్లై చేశారు. వివిధ విభాగాల్లో ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాలు షార్ట్ లిస్ట్‌లో చోటు ద‌క్కించుకుంటాయా లేదా అన్న‌ది చూడాల్సిందే.

ఇండియా నుంచి బెస్ట్‌ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో గుజ‌రాతీ ఫిల్మ్ చెల్లో షో మాత్రమే అధికారికంగా ఎంట్రీని ద‌క్కించుకున్న‌ది. ఆస్కార్ పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వం మార్చి 12న జ‌రుగ‌నుంది.

IPL_Entry_Point