తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr For Golden Globe 2023: ఆస్కార్స్‌ వైపు మరో అడుగు.. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌

RRR for Golden Globe 2023: ఆస్కార్స్‌ వైపు మరో అడుగు.. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌

HT Telugu Desk HT Telugu

12 December 2022, 21:00 IST

    • RRR for Golden Globe 2023: ఆస్కార్స్‌ వైపు మరో అడుగు వేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు రెండు కీలకమైన కేటగిరీల్లో నామినేట్‌ కావడం విశేషం.
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు కేటగిరీల్లో నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు కేటగిరీల్లో నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ (AFP)

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు కేటగిరీల్లో నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ

RRR for Golden Globe 2023: రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల అద్భుతం ఆర్‌ఆర్ఆర్‌ ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒక్కో అడుగు వేస్తోంది. ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్స్‌కు నామినేట్‌ కాలేకపోయినా.. ఇప్పుడు నేరుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో నిలిచే దిశగా మరో అడుగు పడింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Aha OTT Indian Idol 3: ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ 3 మెగా ఆడిషన్స్.. పోటీలో 5 వేల మంది సింగర్స్

Kajal : పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేయ‌మ‌ని భ‌ర్త కండీష‌న్‌ పెట్టాడా? - కాజ‌ల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Krishna mukunda murari serial: ముకుంద కల నెరవేరింది.. మీరా ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న కృష్ణ, ఏం జరగనుంది?

Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లితో రాజ్‌ పెళ్లి- నిజం చెప్పనున్న సుభాష్- రుద్రాణిలా పుట్టింట్లో అపర్ణ

నాన్‌-ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కేటగిరీలో బెస్ట్‌ పిక్చర్‌ నామినేషన్‌ అందుకుంది. ఈ రేసులో ఆర్‌ఆర్ఆర్‌తోపాటు ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ద వెస్టర్న్‌ ఫ్రంట్‌, అర్జెంటీనా 1985, క్లోజ్‌, డెసిషన్‌ టు లీవ్‌లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక రెండో నామినేషన్‌ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌కు దీనికోసం నామినేట్‌ అయింది.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గతంలో ఈ అవార్డులు గెలుచుకున్న ఎన్నో సినిమాలు ఆస్కార్స్‌లోనూ సత్తా చాటాయి. ఆ లెక్కన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఓ గొప్ప ఘనతను సొంతం చేసుకున్నట్లే. ఆస్కార్స్‌కు నామినేట్‌ కావడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్న రాజమౌళి ఆ దిశగా ఓ పెద్ద అడుగే వేశాడని చెప్పాలి. ఇప్పుడీ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒకవేళ ఆర్‌ఆర్ఆర్‌ ఈ అవార్డును గనుక గెలుచుకుంటే ఇక తిరుగుండదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.