తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: ముకుంద కల నెరవేరింది.. మీరా ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న కృష్ణ, ఏం జరగనుంది?

Krishna mukunda murari serial: ముకుంద కల నెరవేరింది.. మీరా ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న కృష్ణ, ఏం జరగనుంది?

Gunti Soundarya HT Telugu

09 May 2024, 8:03 IST

    • Krishna mukunda murari serial may 9th episode: ముకుంద ప్లాన్ సక్సెస్ అవుతుంది. మురారి బిడ్డని కడుపులో మోస్తున్నానని ముకుంద తెగ ఆనందపడుతుంది. అటు మీరా ప్రెగ్నెంట్ అనే విషయం కృష్ణకి తెలిసిపోతుంది. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 9వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 9వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 9వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial may 9th episode: కృష్ణ బిడ్డని కనలేకపోతున్నానని బాధపడుతుంది. మురారి నచ్చజెప్పడానికి చూస్తాడు. సరోగసి ప్రాసెస్ లో మంచి అమ్మాయి దొరకడం ఎంత కష్టం. అలాంటిది ఒక అమ్మాయి దేవతలా ఒక మంచి అమ్మాయి దొరికింది కదా అంటాడు.

ట్రెండింగ్ వార్తలు

Super Star Krishna: అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా.. 44 ఏళ్ల నాటి సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఏదంటే?

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OTT Heroine: ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్.. ఆమె ముందు స్టార్ హీరోలు సైతం దిగదుడుపే!

NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

మీరా దేవత

దేవత, మంచి అమ్మాయి అంటున్నారు అంటే మీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసు కదా అంటుంది. అదేమీ లేదు మన బిడ్డని తొమ్మిది నెలలు మోస్తుందంటే దేవత కదా అంటాడు. నిజంగా మీరా దేవతని మురారి మనసులోనే అనుకుంటాడు.

కృష్ణ, మురారి హాస్పిటల్ కి వస్తారు. సరోగసి మథర్ ని కూడా ఇప్పుడే హాస్పిటల్ కి పిలిచి ఉంటారు కదా అంటుంది. అప్పుడే ముకుంద కూడా హాస్పిటల్ కి వస్తుంది. ఒకవేళ వస్తే డాక్టర్ ని బతిమాలకుండానే చూసేయొచ్చు కదా అంటుంది.

ఆవిడ ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్న ఎవరైనా కావచ్చు అంటూ హాస్పిటల్ లో ఉన్న అందరినీ చూపిస్తాడు. అప్పుడే మీరా రావడం చూసి మురారి షాక్ అవుతాడు. తనని ముందే రమ్మని చెప్పాను కదా ఇప్పుడు మీరాని చూస్తే కృష్ణకు డౌట్ వస్తుందని అనుకుని మీరా కనిపించుకుండా అడ్డంగా నిలబడతాడు.

వెలకట్టలేని అపురూపం నువ్వు

కృష్ణ డాక్టర్ దగ్గర ఉండగా మురారి, మీరా మాట్లాడుకుంటారు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అరుదు అది మా అదృష్టం. నీకు చాలా థాంక్స్ అంటాడు. అనాథని అని అద్దె గర్భం మోస్తున్నానని వెల కట్టరు కదాని అడుగుతుంది. వెల కట్టలేని అపురూపాలు కొన్ని ఉంటాయి అందులో నువ్వు ఒకటి.

నువ్వు మా ఇంటి మనిషివి. నీకు వెల కట్టడం అంటే మాకు మేము వెలకట్టడమే అంటాడు. ఆదర్శ్ జాగింగ్ కి వెళ్తూ ముకుందని చూశారా అని అడుగుతాడు. వెళ్లేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదని అంటాడు. భవానీ, రేవతి ఆదర్శ్ ని చూసి మురిసిపోతారు.

ఆదర్శ్, ముకుంద పెళ్లి

ఆదర్శ్ తనకోసం అంతగా ఆరాటపడుతుంటే ఇంక ఆలోచించడానికి ఏమి లేదు. సమయం చూసి ముకుందతో మాట్లాడాలని భవానీ ఫిక్స్ అవుతుంది. సరోగసి ప్రాసెస్ ప్రారంభమయ్యిందని డాక్టర్ వైదేహి చెప్తుంది. ఎలాగైనా సరోగసి మథర్ ఎవరో తెలుసుకోవాలని కృష్ణ ట్రై చేస్తుంది.

ముకుంద తన కడుపులో మురారి బిడ్డ వచ్చాడని తెగ సంతోషపడుతుంది. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఇదే. నా మురారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుందని సంబరంగా ఉంటుంది. ముకుంద ఉన్న గది దగ్గరకు కృష్ణ వచ్చేసరికి వైదేహి ఎదురుపడుతుంది.

కృష్ణ ప్లాన్ ఫెయిల్

సరోగసి మథర్ కోసం వెతుకుతుంది. నేను రావడం ఒక్క క్షణం లేట్ అయినా తెలిసిపోయేదని మురారికి చెప్తుంది. ఎందుకు కృష్ణ ఇలా చేశావని మురారి కూడా తిడతాడు. షాపింగ్ అని వాళ్ళు అలా తిరుగుతుంటే ఇక నా కూతురిని ఎలా పెళ్లి చేసుకుంటాడని రజిని అనుకుంటుంది.

కృష్ణని రజిని పిలుస్తుంది. ఆదర్శ్ ముకుందకు చీరలు కొంటున్నాడు. తను ముకుందని ఇష్టపడుతున్నాడని అనడానికి ఇంకేం కావాలి. ముకుంద ఎలా ఉంటుంది, ఏ చీర కట్టుకుంటుందని చూస్తున్నాడు. అంత ఇష్టం ఉండబట్టే కదా తీసుకున్నాడు.

నోరుజారిన ముకుంద

ముకుంద, ఆదర్శ్ ప్రేమించుకుంటున్నారని అంటుంది. ముకుంద ఇదంతా కావాలని చేస్తుంది, నా కూతురిని పట్టించుకోవడం లేదు. డబుల్ గేమ్ ఆడింది. నేను అలాగే చేయవచ్చు కానీ వాళ్ళ ప్రేమ చెడగొట్టిన పాపం ఎందుకు మూటగట్టుకోవాలని అనుకుంటుంది.

ముకుంద ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళావని భవానీ అడుగుతుంది. ఫ్రెండ్ ని కలవడానికని అబద్ధం చెప్తుంది. ఆదర్శ్ ఎదురుపడి హాస్పిటల్ కి వెళ్ళిన పని అయిపోయిందా అంటే అయిపోయిందని నోరు జారుతుంది.

నువ్వు నిజం చెప్పేశావ్ ముకుంద పొద్దున కృష్ణ వాళ్ళు వెళ్ళిన టైమ్ లోనే వెళ్ళావు. ఇప్పుడు వాళ్ళ వెనుకే తిరిగి వచ్చావు. అంటే వాళ్ళతో కలిసి హాస్పిటల్ కి వెళ్ళినట్టే కదా అంటాడు. మా అమ్మకి చెప్పినట్టు అబద్ధం చెప్పొద్దని అంటాడు.

అవును వెళ్ళాను కానీ కృష్ణ వాళ్ళతో కలిసి కాదు. నేను ఇంతకముందు ఉన్న నేను అద్దెకు ఉండే దాన్ని కదా ఆయనకు సీరియస్ గా ఉందని అంటే వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి ఆయన చనిపోయాడని డ్రామా ఆడుతుంది. అమ్మతో ఇదే చెప్పవచ్చు కదా అంటాడు.

ఇంట్లో పూజ జరుగుతుంది చనిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాను అంటే బాగోదని చెప్పలేదని అంటుంది. సారి ముకుంద కృష్ణకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే ముందు నువ్వే పరిగెడుతున్నావ్. ఇప్పుడు కూడా నువ్వు అలాగే వెళ్ళావ్ అనుకున్నానని సారి చెప్తాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది

తరువాయి భాగంలో..

కృష్ణ, మురారి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే ముకుంద కళ్ళు తిరిగి పడిపోతుంది. కృష్ణ తనని చెక్ చేస్తుంది. మీరా ప్రెగ్నెంట్ అని కృష్ణకి అర్థం అవుతుంది. అమృత టెస్ట్ చేస్తుంది. తనకి కూడా విషయం అర్థం అవుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం