Amavasya : అమావాస్య అశుభమా? ఏ దేవుడిని పూజించాలి? ఈరోజు బిడ్డ పుడితే మంచిది కాదా?
Amavasya : అమావాస్య అనగానే చాలా మంది కాస్త భయంతో ఉంటారు. అయితే ఈరోజు అశుభమా? ఎందుకు అలా అంటారు?
అమావాస్య రోజున చీకటి రాత్రి.. అంటే చాలా మందికి భయం. ఈ సమయంలో సాయంత్రం అవుతుండగా అమావాస్య చీకటి భయంకరంగా ఉంటుంది. పౌర్ణమి-అమావాస్య అనేది ప్రకృతి ప్రక్రియ. ప్రతి నెల పౌర్ణమి-అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ అమావాస్యను పవిత్రమైనదిగా పరిగణించరు. అమావాస్యను ఎందుకు పవిత్రమైనదిగా పరిగణించలేదో చూద్దాం..
మత విశ్వాసాల ప్రకారం, అమావాస్య నాడు ఎటువంటి శుభ కార్యాలు చేయరు. ఈ రోజున వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు చేయడం మంచిది కాదని నమ్ముతారు.
అమావాస్య నాడు ఈ పనులు చేయడం మంచిది కాదు
సూర్యోదయానికి ముందు ఇల్లు వదిలి బయటకు రాకూడదు అంటారు.
సూర్యోదయానికి ముందు స్నానం చేసి నీరు తాగకూడదు.
కొత్త దుస్తులు ధరించకూడదు అంటారు. అమావాస్య నాడు కొత్త బట్టలు, కొత్త నగలు ధరించండి.
ఈ రోజున ఏ దేవుడిని పూజించాలి?
అమావాస్య రోజున ప్రత్యేకంగా ఒక్క దేవుడిని పూజించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన దేవుడిని పూజించవచ్చు. మంచి ఆరోగ్యం కోసం ఈ రోజున దుర్గాదేవిని పూజిస్తారు. నచ్చిన భక్తులు కార్తికేయుడిని పూజిస్తారు.
కొంత మంది అమావాస్య నాడు పుడితే మంచిది కాదు అంటారు కానీ, అమావాస్య నాడు పుట్టిన బిడ్డ అదృష్టవంతుడని, ఆ బిడ్డ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందని కూడా పండితులు చెబుతారు. సంతానం అంటే శుభం, సంతోషం, అమావాస్య నాడు పుడితే ఇంకా మంచి జరుగుతుందని అంటారు.
అమావాస్య రోజున దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. కాబట్టి ఈ రోజున కొత్త బట్టలు ధరించడం, ఏదైనా శుభకార్యాలు చేయడం, గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదని చెబుతారు.
ఎవరైనా వారి జీవితంలో ఒక రకమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారి విశ్వాసం ప్రకారం జీవిస్తారు. అమావాస్య అశుభ దినమని కొందరంటే అదంతా మూఢనమ్మకమని మరికొందరు వాదిస్తున్నారు. ఇక్కడ ఎవరు సరైనవారు, ఎవరు సరైన వారు కాదు అనే చర్చకు వెళ్లడం లేదు. ఎవరి నమ్మకాల ప్రకారం వారు జీవించడంలో తప్పు లేదు..
ఈ ఏడాది ఇప్పటికే కొన్ని అమావాస్యలు అయిపోయాయి. మే 7న వైశాఖ అమావాస్య ఉంది. ఇంకా ఎన్ని అమావాస్యలు ఉన్నాయో చూద్దాం..
వైశాఖ అమావాస్య - 7 మే 2024 (అమావాస్య తిథి మే 7న ఉదయం 11:40 గంటలకు ప్రారంభమై మే 8న ఉదయం 08:51 గంటలకు ముగుస్తుంది.)
జ్యేష్ఠ అమావాస్య - 6 జూన్ 2024 (అమావాస్య తిథి జూన్ 5న రాత్రి 07:54 గంటలకు ప్రారంభమై జూన్ 6న సాయంత్రం 06:07 గంటలకు ముగుస్తుంది.)
ఆషాఢ అమావాస్య - 5 జూలై 2024 (అమావాస్య తిథి జూలై 5వ తేదీ ఉదయం 04:57 గంటలకు ప్రారంభమై జూలై 6వ తేదీ ఉదయం 04:26 గంటలకు ముగుస్తుంది.)
శ్రావణ అమావాస్య - 4 ఆగస్టు 2024 (అమావాస్య తిథి ఆగస్టు 3వ తేదీ మధ్యాహ్నం 03:40 గంటలకు ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 04:42 గంటలకు ముగుస్తుంది.)
భాద్రపద అమావాస్య - 2 సెప్టెంబర్ 2024 (అమావాస్య తిథి సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 07:24 గంటలకు ముగుస్తుంది.)
అశ్విన్ అమావాస్య - 2 అక్టోబర్ 2024 (అమావాస్య తిథి అక్టోబర్ 31న తెల్లవారుజామున 03:52 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 3న మధ్యాహ్నం 12:18 గంటలకు ముగుస్తుంది.)
కార్తీక అమావాస్య - 1 నవంబర్ 2024 (అమావాస్య తిథి నవంబర్ 30న ఉదయం 10:29 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 06:16 గంటలకు ముగుస్తుంది.)
మార్గశీర్ష అమావాస్య - 1 డిసెంబర్ 2024 (అమావాస్య తిథి నవంబర్ 30న ఉదయం 10:29 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 1న ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది.)