తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr First Review | అగ్గి పుట్టించిన డెడ్లీ కాంబో.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది!

RRR First Review | అగ్గి పుట్టించిన డెడ్లీ కాంబో.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది!

HT Telugu Desk HT Telugu

22 March 2022, 6:19 IST

    • RRR First Review వచ్చేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ డెడ్లీ కాంబినేషన్‌తో రాజమౌళి అగ్గి పుట్టించాడంటూ యూకే, యూఏఈ సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుడు ఉమేర్‌ సంధు తన ఫస్ట్‌ రివ్యూ ఇచ్చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter)

ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించినప్పటి నుంచీ ఈ మూవీకి ఎక్కడలేని హైప్‌ వచ్చేసింది. కరోనా కారణంగా సుమారు రెండేళ్లు ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆతృత మరింత పెరిగింది. ఆ వెయిట్‌ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారమే ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ కాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

అయితే ఆ లోపే ఈ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, యూకే, యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమేర్‌ సంధు ఈ మూవీని చూసి తన రివ్యూ చెప్పేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌స్టోరీలో సింపుల్‌గా ఈ మూవీ ఎలా ఉందో ఆయన చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి ఆత్మ జూనియర్‌ ఎన్టీఆరే. అతడే మొత్తం షోని నడిపించాడు. రామ్‌చరణ్‌ టెర్రిఫిక్‌. ఆర్‌ఆర్‌ఆర్‌లో డెడ్లీ కాంబోతో రాజమౌళి అదరగొట్టాడు. ఈ ఇద్దరూ కలిసి అగ్గి పుట్టించారు అంటూ ట్విటర్‌లో ఉమేర్‌ సంధు ట్వీట్‌ చేశారు.

ఇది కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అంటూ తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆయన పోస్ట్‌ చేశారు. గొప్పగా కలలు కని, దానిని చేసి చూపెట్టిన ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్‌ను చూసి గర్వపడతారు. ఇప్పుడు బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌ అని అంటున్నాం కానీ.. రేపు ఇదే సినిమా క్లాసిక్‌గా గుర్తుంచుకుంటారు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. వీళ్లది డెడ్లీ కాంబో. అజయ్‌ దేవ్‌గన్ ఓ సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌ అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఉమేర్‌ రివ్యూ రాసుకున్నారు. ఈ మూవీ ఈ నెల 25 (శుక్రవారం)న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. దీనికోసమే ఆర్ఆర్‌ఆర్‌ త్రయం ఇండియా అంతా తిరుగుతూ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.