తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr | మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ ధరలు ఎంతంటే..

RRR | మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ ధరలు ఎంతంటే..

HT Telugu Desk HT Telugu

21 March 2022, 23:29 IST

  • తెలంగాణ‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ప్ర‌భుత్వం ఇటీవ‌లే అనుమ‌తి ఇచ్చింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం హైద‌రాబాద్ లోని మ‌ల్టీప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో టికెట్ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

రామ్ చరణ్, ఎన్టీఆర్
రామ్ చరణ్, ఎన్టీఆర్ (twitter)

రామ్ చరణ్, ఎన్టీఆర్

‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ హీరోలుగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను బిగ్ స్క్రీన్‌లో చూడాలని అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ ఎప్పుడు మొద‌లుకానున్నాయా అని నిరీక్షించారు. ఆదివారం నుంచి బుక్ మై షో తో పాటు మరికొన్ని యాప్ లలో టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ పెంచిన ధ‌ర‌ల ప్ర‌కారం మ‌ల్టీప్లెక్స్ లోని రిక్లైనర్ సీట్స్ ధ‌ర 470 రూపాయ‌లుగా, నార్మల్ సీట్స్ 410 రూపాయలుగా చూపిస్తోంది. అలాగే సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కానీ టికెట్ కు 250 రూపాయలుగా బుకింగ్స్ యాప్ లో ధ‌ర‌ కనిపిస్తోంది. ఆ తర్వాతి క్లాస్ ల‌కు 150, 100 గా ధరలు నిర్ణయించారు. పది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు ప్ర‌భుత్వం అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏసీ థియేటర్లలో మొదటి మూడు రోజులు 50 రూపాయలు, ఆ తర్వాత ఏడు రోజులు 30 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది. మల్టీప్లెక్స్ లలో మొదటి మూడు రోజులు 100 రూపాయలు...ఆ తర్వాత ఏడు రోజులు యాభై రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఇదివరకు మల్టీప్లెక్స్‌లలో 300లుగా టికెట్ ధర ఉండేది. ఇప్పుడు పెంచిన ధరలతో పాటు అదనంగా టాక్స్ లు కలుపుకొని 470 రూపాయలకు చేరుకుంది. ఈ ధరలపై అభిమానులు విమర్శలు వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో టికెట్ల ప్రైస్‌ ఉంటే రిపీటెడ్ ఆడియోన్స్ థియేటర్స్‌కు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం