తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun And Rajamouli | బన్నీతో రాజమౌళి సినిమా.. అన్నీ కుదిరితే అప్పుడే ..!

Allu Arjun and Rajamouli | బన్నీతో రాజమౌళి సినిమా.. అన్నీ కుదిరితే అప్పుడే ..!

HT Telugu Desk HT Telugu

16 March 2022, 20:28 IST

    • టాలీవుడ్ జక్కన్న రాజమౌళి- అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రాబోతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మహేశ్‌ బాబు తర్వాత రాజమౌళి స్టైలిష్ స్టార్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నాడని తెలుస్తోంది.
బన్నీ-రాజమౌళి చిత్రం
బన్నీ-రాజమౌళి చిత్రం (Instagram)

బన్నీ-రాజమౌళి చిత్రం

పుష్ప సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ మీదున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్ర విజయంతో ఒక్కసారిగా పాన్ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప2 కోసం సిద్ధమవుతున్న స్టైలిష్ స్టార్.. తర్వాతి చిత్రం ఎవరితో చేస్తారనే అంశంపై ఆసక్తిపై నెలకొంది. తదుపరి చిత్రాలను కూడా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పుష్ప-2 తర్వాత ఆయన దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ప్రస్తుతం మన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాపైనే తన దృష్టంతా పెట్టారు. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నానని ఇప్పటికే ఆయన పలు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్‌తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని చిత్రవర్గాలు కోడైకూస్తున్నాయిు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నాయని, మహేశ్‌తో సినిమా తర్వాత ఇది ఉంటుందని లేదా ఆ చిత్రం కంటే ముందే వస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహాగానాలు ఎంతమేరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఓ సినిమాకు ఓకే చెప్పారని వార్తలు విపించాయి. ఇటీవలే ఆయనను స్టైలిష్ స్టార్ సమావేశం కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతానికి చర్చల దశల్లోనే ఉన్న ఈ సినిమా రాక కోసం అటు హిందీ ప్రేక్షకులతో పాటు ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్.. తగ్గేదేలే అనే ఒక్క డైలాగుతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను కట్టి పడేశారు. ఆయన మేనరిజానికి సెలబ్రిటీల సైతం ఫిదా అయిపోయారు. గతేడాది డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ను అందుకుంది. బాక్సాఫీస్ ముందు రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంది. ప్రస్తుతం బన్నీ పుష్ప రెండో భాగంలో నటిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం