తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc15 Song Shoot: ఆర్సీ15 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఒక్క సాంగ్‌కే రూ.15 కోట్లు

RC15 Song Shoot: ఆర్సీ15 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఒక్క సాంగ్‌కే రూ.15 కోట్లు

HT Telugu Desk HT Telugu

16 November 2022, 20:05 IST

    • RC15 Song Shoot: ఆర్సీ15 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలో ఒక్క సాంగ్‌ షూటింగ్‌కే రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ తాజా అప్‌డేట్‌తో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో పండగ చేసుకుంటున్నారు.
కియారా అద్వానీ, రామ్ చరణ్
కియారా అద్వానీ, రామ్ చరణ్ (twitter)

కియారా అద్వానీ, రామ్ చరణ్

RC15 Song Shoot: డైరెక్టర్‌ శంకర్‌ ఏం చేసినా ఓ సంచలనమే. 90వ దశకంలో అతని సినిమాలు ఓ ప్రభంజనం. ఒక్కో సినిమాలో ఒక్కో ప్రత్యేకతతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం శంకర్‌కే సాధ్యం. జెంటిల్మన్‌, భారతీయుడు, జీన్స్‌, ప్రేమికుడు, ఒకే ఒక్కడు.. ఇలా ప్రతి సినిమా ఓ సంచలనమే. భారీ బడ్జెట్‌తో సినిమాలు చేయడం శంకర్‌ అలవాటు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

బడ్జెట్‌ ఒక్కటే కాదు.. తన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం ఒకటి ఉంటుంది. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో అతడు చేస్తున్న ఆర్సీ15 మూవీలోనూ అలాంటిదే ఓ ప్రత్యేకత ఉండబోతోంది. దీనికి సంబంధించి బుధవారమే (నవంబర్‌ 16) మూవీ మేకర్స్‌ ఓ కీలకమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలోని ఒక పాట కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారన్నది ఆ అప్‌డేట్‌ సారాంశం.

సౌతిండియాలో ఇదే అత్యంత ఖరీదైన పాటగా రికార్డు నెలకొల్పనుంది. ఈ సాంగ్‌ను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్ 2 వరకూ చిత్రీకరించనున్నారు. మూవీలోని లీడ్‌ రోల్స్‌ రామ్‌చరణ్‌, కియారా అద్వానీలపై ఈ సాంగ్‌ షూట్‌ చేయనున్నారు. 12 రోజులు, రూ.15 కోట్ల బడ్జెట్‌.. ఒక పాట అంటేనే అది ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పైగా శంకర్‌ టేకింగ్‌ కూడా చాలా రిచ్‌గా ఉంటుంది.

ప్రస్తుతం ఇండియన్‌ 2 మూవీ షూటింగ్‌ కూడా చేస్తున్న శంకర్‌.. గ్యాప్‌ దొరికినప్పుడల్లా ఆర్సీ15 షూటింగ్‌కు టైమ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ అత్యంత ఖరీదైన పాట షూట్ కోసం శంకర్‌ సమయం కేటాయించాడు. ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, కియారా అదిరిపోయే స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాల్లో ఈ పాటను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ పాటను అనుకున్నట్లుగా షూట్‌ చేయడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాంగ్‌ ఆర్సీ15 మూవీకే హైలైట్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. గతంలో జీన్స్‌ మూవీలోనూ శంకర్‌ అప్పటి ప్రపంచంలోని ఏడు వింతల దగ్గర ఒక పాటను చిత్రీకరించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అతిశయం పాట ఇప్పటికీ ఇండియన్‌ సినిమా హిస్టరీలో హైలైట్‌గా నిలుస్తోంది.

ఇప్పుడు ఆర్సీ15 మూవీని కూడా శంకర్‌ తనదైన రీతిలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ మూవీకి కథ అందించాడు. ఇక దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ కింద నిర్మిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్‌ కానుంది. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.