Indian 2 Movie Update: ఇండియన్ 2లో కమల్ విశ్వరూపం.. 14 భాషల్లో 10 నిమిషాల డైలాగ్..!-indian 2 kamal haasan 10 minutes lengthy dialogue in 14 languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Indian 2 Kamal Haasan 10 Minutes Lengthy Dialogue In 14 Languages

Indian 2 Movie Update: ఇండియన్ 2లో కమల్ విశ్వరూపం.. 14 భాషల్లో 10 నిమిషాల డైలాగ్..!

Maragani Govardhan HT Telugu
Sep 16, 2022 10:18 PM IST

Indian 2 Kamal Dialogue: కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో ఓ సుదీర్ఘ డైలాగ్ ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సంభాషణనను కమల్ సింగిల్ టేక్ చెప్పారట. అంతేకాకుండా ఇది 14 భాషల్లో ఉంటుందని సమాచారం.

ఇండియన్ 2 కమల్ హాసన్
ఇండియన్ 2 కమల్ హాసన్ (MINT_PRINT)

Kamal Haasan Performance in Indian 2: లోకనాయకుడు కమల్ హాసన్ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తాత్కాలికంగా ఆగిపోయిన ఇండియన్ 2 కూడా తిరిగి ప్రారంభించారు. ఈ చిత్రానికి విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇటీవలే ప్రారంభమైనట్లు చిత్రబృందం తెలిపింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం ఈ సినిమాలో ఈ సుదీర్ఘ డైలాగును కమల్ చెప్పనున్నారట. పద్నాలుగు భాషల్లో దాదాపు 10 నిమిషాల పాటు సాగే డైలాగును చెప్పారని సమాచారం. ఆయన నటనలో ఆయనతో పోటీ పడే సత్తా ఎవరికీ ఉండదనే విషయం తెలిసిందే. అయితే ఒకప్పటిలా ఆయన ఓపికగా చెప్పడానికి యువకుడే కాదు. కానీ యాక్టింగ్ అంటే ఉన్న ప్యాషన్‌తో 65 ఏళ్ల పైచిలుకు వయస్సులో సుదీర్ఘ సంభాషణను పలికారట. ఇది కూడా ఒక భాషలో కాదు.. 14 భాషల్లో చెప్పారటు. పది నిమిషాల పాటు సాగే ఈ డైలాగ్ సినిమాలో కీలకమైన సన్నివేశంలో వస్తుందని తెలుస్తుంది.

సింగిల్ టేక్‌లో కమల్ ఈ డైలాగ్‌ చెప్పారట. అది కూడా పద్నాలుగు భాషల్లో కావడంతో చిత్ యూనిట్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఈ సినిమా 1996లో శంకర్ తెరకెక్కించిన ఇండియన్ చిత్రానిక సీక్వెల్‌గా వస్తుంది. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదలైంది.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా.. పీటర్ హెయిన్స్ స్టంట్లు రూపొందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం