RC15 Update: రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ షూటింగ్‌పై కీలకమైన అప్‌డేట్‌-rc15 latest update reveals the shoot will begin in october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc15 Latest Update Reveals The Shoot Will Begin In October

RC15 Update: రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ షూటింగ్‌పై కీలకమైన అప్‌డేట్‌

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 10:09 PM IST

RC15 Update: రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ షూటింగ్‌పై మరో కీలకమైన అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతానికి ఆర్సీ15గా పిలుస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ నెల జరిగే అవకాశం అయితే లేదు.

ఆర్సీ15 షూటింగ్ లొకేషన్ లో రామ్ చరణ్
ఆర్సీ15 షూటింగ్ లొకేషన్ లో రామ్ చరణ్ (Twitter)

RC15 Update: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ, తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌ మూవీ షూటింగ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో మళ్లీ మొదలుపెడుతున్నట్లు గత నెలలో శంకర్‌ ప్రకటించాడు. కానీ తాజా అప్‌డేట్‌ ప్రకారం.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. శంకర్‌ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ఇండియన్‌ 2 షూటింగ్‌తో బిజీ కావడమే దీనికి కారణం.

కమల్‌హాసన్‌తో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో ఆర్సీ15 ఆగస్ట్‌, సెప్టెంబర్‌ షూటింగ్‌లను రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చిన అప్‌డేట్‌ ప్రకారం.. ఆర్సీ15 షూటింగ్ అక్టోబర్‌, నవంబర్‌లలో జరగనుంది. ఈ మూవీ ప్రస్తుతానికి పెండింగ్‌లో పడటంతో చెర్రీ కూడా మరో పనిలో బిజీ అయిపోయాడు.

అతడు ఇతర డైరెక్టర్ల స్క్రిప్ట్‌ వింటున్నాడు. అంతేకాదు కన్నడ డైరెక్టర్‌ నర్తన్‌ డైరెక్షన్‌లో మూవీకి సంతకం కూడా చేయడం విశేషం. ఈ మూవీ షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఆర్సీ15 విషయానికి వస్తే అక్టోబర్‌లో ఈ మూవీని పది రోజుల పాటు చిత్రీకరించడానికి డైరెక్టర్‌ శంకర్‌ ప్లాన్‌ చేశాడు. ఇలాగే నవంబర్‌లోనూ మరో పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరగనుంది.

అదే సమయంలో శంకర్‌ తన ఇండియన్‌ 2 మూవీ షూటింగ్‌ను కూడా కొనసాగించనున్నాడు. నిజానికి ఆర్సీ15 మూవీని వచ్చే ఏడాది వేసవికాలంలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోవడంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రిలీజ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో షూటింగ్‌కు రామ్‌చరణ్‌ ఓకే చెప్పడంతో శంకర్‌ టీమ్‌ డేట్స్‌ను ఫైనల్‌ చేసే పనిలో ఉంది.

ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆర్సీ15కు అధికారి అనే టైటిల్‌ పెట్టనున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ మేకర్స్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ఈ మూవీలో రామ్‌చరణ్‌ డ్యుయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. దిల్‌ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తుండగా.. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.