తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc15 Shooting Will Commence Soon Says Shankar In His Official Twitter Handle

RC15 Shooting: రామ్‌చరణ్‌ మూవీపై శంకర్‌ క్లారిటీ.. షూటింగ్‌ అప్పటి నుంచే

HT Telugu Desk HT Telugu

25 August 2022, 11:28 IST

    • RC15 Shooting: రామ్‌చరణ్‌ మూవీ ఆర్సీ15పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్‌ శంకర్‌. సినిమా షూటింగ్‌ మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందో అతడు తన ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు.
డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ (ఫైల్ ఫొటో)
డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ (ఫైల్ ఫొటో) (twitter)

డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ (ఫైల్ ఫొటో)

RC15 Shooting: టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ ఆర్సీ15. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్‌ కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ఈ మూవీకి అధికారి అనే పేరు కూడా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సడెన్‌గా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దీనిపై మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమాధానమివ్వాల్సిందిగా ప్రొడక్షన్‌ హౌజ్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మూవీ డైరెక్టర్‌ శంకరే దీనిపై స్పందించాడు. బుధవారం (ఆగస్ట్‌ 24) రాత్రి తన ట్విటర్‌ ద్వారా షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్‌ 2 షూటింగ్ కోసం దీనిని ఆపామని, ఇక నుంచి రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్‌ చేస్తానని చెప్పాడు.

"అందరికీ నమస్కారం. ఇండియన్‌ 2, ఆర్సీ15 రెండింటినీ ఒకేసారి షూట్‌ చేస్తాం. సెప్టెంబర్‌ తొలి వారంలో హైదరాబాద్‌, వైజాగ్‌లలో ఆర్సీ15 తర్వాతి షెడ్యూల్‌ షూట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని శంకర్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌లో దిల్‌ రాజు, రామ్‌చరణ్‌ ట్విటర్‌ హ్యాండిల్స్‌ను కూడా ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌తో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చేసినట్లే.

సుమారు మూడు దశాబ్దాలుగా ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందించిన డైరెక్టర్‌ శంకర్‌తో రామ్‌చరణ్‌ మూవీ చేస్తున్నాడనగానే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌ కచ్చితంగా మ్యాజిక్‌ చేస్తుందని వాళ్లు ఆశతో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కియారా అద్వానీ ఈ మూవీలో ఫిమేల్‌ లీడ్‌గా కనిపించనుంది. దిల్‌ రాజు ప్రొడ్యూస్‌ చేస్తుండగా.. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.