Indian 2: భారతీయుడు మొదలుపెట్టారు.. కమల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్-kamal haasan and shankar indian 2 movie remain shoot commencing today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan And Shankar Indian 2 Movie Remain Shoot Commencing Today

Indian 2: భారతీయుడు మొదలుపెట్టారు.. కమల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

Maragani Govardhan HT Telugu
Aug 24, 2022 07:40 AM IST

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రానున్న ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు దర్శకుడు శంకర్ ట్విటర్ వేదికగా తెలియజేశారు.

ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభం
ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభం (Twitter)

లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2ను ప్రారంభించింది చిత్రబృందం. అయితే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అయితే ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి అడ్డంకులు, దర్శక నిర్మాతల మధ్య విభేదాలు కారమంగా మద్యలోనే ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా తిరిగి ప్రారంభిస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. అనుకున్నట్లే.. ఇండియన్ 2 షూటింగ్‌పై దర్శకుడు తాజాగా అప్డేట్ ఇచ్చారు. బుధవారం నుంచి చిత్ర షూటింగ్ మొదలు కానుందని స్పష్టం చేశారు.

"గుడ్ మార్నింగ్ ఇండియన్స్, ఇండియన్ 2కు సంబంధించిన మిగిలిన షూటింగ్ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. ఈ ప్రకటన చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మీ సపోర్ట్, అభినందనలు మాకు కావాలి" అని దర్శకుడ శంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.

కమల్ హాసన్ తన విక్రమ్ మూవీ ప్రచార కార్యక్రమాల్లోనే ఈ విషయాన్ని గురించి తెలియజేశారు. భారతీయుడు 2ను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తాజాగా శంకర్ షూటింగ్ అప్డేట్‌తో అభిమానులను ఖుషీ చేశారు. కమల్, శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం నుంచి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్-నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు తదితర కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా.. పీటర్ హెయిన్స్ స్టంట్లు రూపొందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం