Kajal Aggarwal: ఇండియన్-2 తిరిగి ప్రారంభమవుతుంది.. కాజల్ క్లారిటీ-kamal haasan to replace kajal with another heroin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan To Replace Kajal With Another Heroin

Kajal Aggarwal: ఇండియన్-2 తిరిగి ప్రారంభమవుతుంది.. కాజల్ క్లారిటీ

Maragani Govardhan HT Telugu
Aug 04, 2022 06:19 PM IST

భారతీయుడు-2లో హీరోయిన్‌గా మొదట కాజల్‌ను అనుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమా నుంచి ఆమెను తప్పించనున్నారట. ఆమె స్థానంలో మరోకరిని తీసుకోనున్నారని తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ (Twitter)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గతేడాది గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనంతరం గర్భం దాల్చడంతో తన వద్ద ఉన్న ఆఫర్లన్నింటినీ ఒక్కొక్కటిగా వదులుకుంది. ఆచార్య, ది ఘోస్ట్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ సమంయలో ఆమె వదులుకున్నవే. తాజాగా మరో భారీ చిత్రం నుంచి ఈ బ్యూటీ తప్పుకుంది. అదే ఏదో కాదు.. డైరెక్టర్ శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో రానున్న భారతీయుడు-2.

ప్రస్తుతం తన బిడ్డతో జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదిస్తున్న కాజల్.. ఇప్పుడప్పుడే సినిమాలకు ఓకే చెప్పేలా లేదు. దీంతో నాగార్జునతో చేయాల్సిన ది ఘోస్ట్ చిత్రం నుంచి కూడా తప్పుకుంది. అదేవిధంగా కమల్ హాసన్‌తో భారతీయుడు 2 చిత్రం చేయాల్సి ఉండగా.. చిన్నారితో బిజీగా ఉన్న ఆమె.. పునరాగమనం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. దీంతో చిత్రబృందం.. తమ సినిమాలో హీరోయిన్‌గా ఆమె స్థానంలో మరోకరిని తీసుకోవాలని భావించారట.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్-నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు తదితర కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇటీవల విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కమల్.. ఆ సినిమా ప్రమోషన్ల సందర్భంగా భారతీయుడు 2 గురించి అప్డేట్ ఇచ్చారు. ఎలాగైన ఈ సినిమా తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ మధ్యలో కాజల్‌కు పెళ్లి జరగడం, గర్భం దాల్చి పండండి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. తాజాగా భారతీయుడు 2 నుంచి ఆమెను తీసివేసి మరోకరిని తీసుకోనున్నారు మేకర్స్. కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం.. భారతీయుడు 2లో కాజల్ స్థానంలో బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

IPL_Entry_Point

సంబంధిత కథనం