తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranveer Singh On Nude Photos Says One Of His Photos Were Morphed

Ranveer Singh on Nude Photos: ఆ న్యూడ్‌ ఫొటో నాది కాదు.. మార్ఫింగ్‌ చేశారు: రణ్‌వీర్‌

Hari Prasad S HT Telugu

15 September 2022, 11:25 IST

    • Ranveer Singh on Nude Photos: ఆ న్యూడ్‌ ఫొటో నాది కాదు.. మార్ఫింగ్‌ చేశారు అంటూ తన న్యూడ్‌ ఫొటోషూట్‌కు కొత్త ట్విస్ట్‌ ఇచ్చాడు రణ్‌వీర్‌ సింగ్‌. అతడు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ గురువారం (సెప్టెంబర్‌ 15) బయటకు వచ్చింది.
రణ్‌వీర్‌ సింగ్‌
రణ్‌వీర్‌ సింగ్‌

రణ్‌వీర్‌ సింగ్‌

Ranveer Singh on Nude Photos: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తన న్యూడ్‌ ఫొటోషూట్‌కు కొత్త ట్విస్ట్‌ ఇచ్చాడు. ఈ ఫొటోషూట్‌పై తనపై నమోదైన కేసులో పోలీసులకు రణ్‌వీర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఫొటోల్లో ఒక దానిని ఎవరో మార్ఫింగ్‌ చేశారని రణ్‌వీర్‌ పోలీసులకు చెప్పినట్లు న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Ramam Raghavam: దర్శకుడిగా జబర్తస్త్ కమెడియన్ ధన్‌రాజ్ ద్విభాషా చిత్రం.. తమిళ హీరో కామెంట్స్

Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

పేపర్‌ అనే మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌ ఒంటిపై నూలుపోగు లేకుండా ఫొటోలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి జులై 26న ఓ ఎన్జీవో ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కూడా ఉంది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

గత నెలలో రణ్‌వీర్‌ పోలీసుల ముందు తన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆగస్ట్‌ 30న ముంబై పోలీసులు అతన్ని రెండు గంటల పాటు ప్రశ్నించారు. "మేము అతన్ని ఆగస్ట్‌ 30న పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పాం. అతడు ఉదయం 7.30 గంటలకు వచ్చి 9.30 గంటల వరకూ అక్కడే ఉన్నాడు" అని జోన్‌ 6 డీసీపీ కృష్ణకాంత్‌ ఉపాధ్యాయ్ వెల్లడించారు.

ఈ విచారణ సందర్భంగా పోలీసులకు అతనికి ఆ న్యూడ్‌ ఫొటోలన్నింటినీ చూపించారు. అయితే అందులో ఒక ఫొటో తనది కాదని రణ్‌వీర్‌ పోలీసులకు చెప్పాడు. ఆ ఫొటోలో తన ప్రైవేట్‌ భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫొటో మాత్రం తనది కాదని, ఎవరో మార్ఫింగ్‌ చేశారని అతడు తెలిపాడు. దీనిపై విచారణ కొనసాగుతోందని, అవసరమైతే రణ్‌వీర్‌ను మరోసారి ప్రశ్నిస్తామని కూడా పోలీసులు చెప్పారు. తమ విచారణలో అతడు పూర్తిగా సహకరించినట్లు కూడా తెలిపారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.